Pages

Monday

టైం సీక్రెట్స్...!


కొందరికి ఏ పని అప్పగించినా టైం సరిపోవడం లేదంటూ హైరానాపడిపోతుంటారు. ముఖ్యమైన పనులను సైతం గడువులోగా పూర్తి చేయలేకపోతుంటారు. దీనికి కారణం సరియైన ప్రణాళిక లేకపోవడమేనని అంటున్నారు నిపుణులు. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలిస్తే ఇబ్బంది ఉండదని వారు సూచిస్తున్నారు.

చిఫోన్‌లో గంటల తరబడి మాట్లాడటం, ప్రతీ ఆరగంటకొకసారి మెయిల్స్ చెక్ చేస్తూ ఉండటం, టీవీ ఎక్కువగా చూడటం, గాసిప్స్ వినడం వంటి వాటివల్ల సమయం వృధా అవుతూ ఉంటుంది. పని వేళల్లో వీటిని తగ్గించుకోవాలి.

చిప్రతిరోజూ చేయాల్సిన ముఖ్యమైన పనులను పేపర్‌పై ప్రాధాన్యత క్రమంలో రాసుకోవాలి. దీనివల్ల ముఖ్యమైన పనులను ఏ రోజున, ఏ సమయంలోగా పూర్తి చేయాలనే విషయంపై అవగాహన వస్తుంది.

చిపనికి అనుగుణంగా ప్రణాళిక తయారుచేసుకోవాలి. రోజులో 24 గంటల సమయం అలానే ఉంటుంది. అందులో మార్పుండదు. మన ప్రణాళికలోనే సమయానికి తగినట్టుగా మార్పులు చేసుకోవాలి.

చిప్రతిరోజు కొంత సమయాన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటే వాటి కోసం వినియోగించుకోవాలి. అందుకు తగ్గట్టుగా ప్రణాళిక వేసుకోవాలి.

చిఉదయం లేవగానే ఆ రోజు చేయాల్సిన పనులను ఒకసారి చెక్ చేసుకుని, అందులో ముఖ్యమైన పని ఏమిటో గుర్తించి దాన్ని ముందుగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి.

చిసమయం సరిపోదని తెలిసినా పని పూర్తి చేస్తామని ఒప్పుకోవద్దు. సమయాభావం వల్ల పని పూర్తి చేయలేకపోయినప్పుడు మీపై దురభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది.

చిసమయం తక్కువగా ఉన్నప్పుడు, పనిని తప్పకుండా పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు కొలీగ్స్ సహాయం తీసుకోవాలి. పనిని షేర్ చే సుకోవడం మూలంగా త్వరగా పూర్తి చేయవచ్చు.

చిఏ పనిలోనైనా ఆటంకాలు ఉంటాయి. వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకుని ముందడుగేయాలి. అప్పుడే పనులను సకాలంలో పూర్తి చేసుకోవచ్చు.

No comments:

Post a Comment