ముంబై మారణకాండ, డెన్మార్ ఉగ్రవాద కుట్రలతో సంబంధం ఉన్న కేసులను తిరిగి విచారణ చేయాలన్న కెనడాలోని పాక్ ఉగ్రవాది తహవ్వూర్ రాణా విజ్ఞప్తిని తిరస్కరించాలని అమెరికా ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. తాను లష్కరే తోయిబాకు సాయం చేసినట్టు న్యాయస్థానం తప్పుగా భావించిందని, వాదించడంలో తాను విఫలమయ్యానని రాణా వాదించాడు.
గత జూన్‌లో మూడు వారాల విచారణ తరువాత నిషేధిత లష్కరేతోయిబాకు అతను సహాయ సహకారాలు అందజేసినట్టు నిరూపితమైంది. దీనిపై న్యాయస్థానం గందరగోళానికి గురైందని, విచారణ సరిగ్గా జరగలేదని ఆరోపిస్తూ, తాజాగా విచారణ చేయాలని గత సెప్టెంబర్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఇల్లినాయిస్ జిల్లా కోర్టు విడుదల చేసిన పత్రాలను ప్రభుత్వం ప్రస్తావిస్తూ , న్యాయస్థానం సరైన శాసన ప్రమాణాలనే పాటించిందని తెలిపింది.

0 comments:
Post a Comment