Pages

Tuesday

ఫరాఖాన్ భర్తను కుమ్మేసిన షారుఖ్...


బాలివుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన వివాదాస్పద చర్యలతో తరచు వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో కత్రినాకైఫ్ పుట్టినరోజు పార్టీలో కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌తో గొడవ తర్వాత.. షారుఖ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. తనకు హిట్ సినిమాలనందించిన దర్శకురాలు ఫరాఖాన్ భర్తపై చేయిచేసుకున్నాడు. ఇటీవల విడుదలైన అగ్నిపథ్ సినిమా విజయాన్ని పురస్కరించుకుని సహనటుడు సంజయ్‌దత్ ఏర్పాటు చేసిన ఓ పార్టీలో ఈ ఘటన జరిగింది. 

ఫరా భర్త శిరీష్ కుందర్ ఆ పార్టీలో షారుఖ్ వెనకాలే తిరగడం ప్రారంభించాడని, చివరకు బాత్‌రూంలోకి కూడా వెళ్లాడని తెలిసింది. దీంతో చిర్రెత్తుకొచ్చి షారుఖ్ శిరీష్‌ను పిడిగుద్దులతో కుమ్మేశాడు. నోటికొచ్చినట్లు తిట్టడం ప్రారంభించాడు. ఇంతలో పార్టీ ఏర్పాటు చేసిన సంజయ్‌దత్ వచ్చి ఇద్దరినీ విడదీశాడు. అంతేకాక తన భార్యకు అసభ్య సందేశాలు పంపుతున్నాడని దూషిస్తూ సంజయ్‌కూడా శిరీష్‌పై పిడిగుద్దులు కురిపించాడు. అయితే ఈఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంలేదని శిరీష్ తెలిపాడు. షారుఖ్ తన భర్త పై దాడి చేయడాన్ని ఫరాఖాన్ ఖండించింది.

No comments:

Post a Comment