Pages

Tuesday

చీర బిగిస్తే.. కేన్సర్ ముప్పు!...



చీరకట్టు వల్ల కూడా కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్న విషయం ఎప్పుడైనా విన్నారా? ముంబైలోని గ్రాంట్ మెడికల్ కాలేజీలోని వైద్య నిపుణులు ఈ ముప్పు గురించి హెచ్చరిస్తున్నారు. రెండేళ్లలో తాము ముగ్గురు 'చీర కేన్సర్' రోగులకు చికిత్స చేసినట్లు ఆ కాలేజీలో శస్త్రచికిత్స విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.డి.బక్షి తెలిపారు. మరో కేసు మూణ్నెల్ల క్రితమే వచ్చిందన్నారు. ఆ ముగ్గురు మహిళలూ 40 ఏళ్లు పైబడినవారేనట. ప్రతిరోజూ ఒకేచోట లంగా కట్టుకోవడం, దాని నాడాను బాగా బిగించి కట్టడంతో నడుం వద్ద తీవ్రమైన రాపిడి ఏర్పడుతుందని, ఇది తరచు రావడం వల్ల పిగ్మెంటేషన్‌కు దారి తీస్తుందని వైద్యులు చెప్పారు. 

ఈ సమస్య బాగా ఎక్కువయ్యేవరకు చాలామంది గమనించరని, నడుం వద్ద వచ్చే డెర్మటోసిస్ చివరకు ప్రాణాంతకం కూడా అవుతుందని హెచ్చరించారు. లోపలి లంగాలను కాస్త వదులుగా కట్టుకోవడం.. లేదా, సంప్రదాయ నాడాలకు బదులు వెడల్పాటి నాడాలను వాడటం వల్ల ఆ ప్రాంతంపై ఒత్తిడి తగ్గి సమస్యను అధిగమించే అవకాశం ఉంటుందని డాక్టర్ బక్షి సూచించారు. చీరను కాస్త పైకి, కిందకు మార్చిమార్చి కట్టుకోవడం వల్ల ఒత్తిడి ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుం డా చూసుకోవచ్చునని తెలిపారు.

No comments:

Post a Comment