Pages

Saturday

సోషల్ సైట్లలో వివరాలు తీసేయండి...!


సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఖాతాలున్న సైనికులు.. ప్రొఫైల్స్‌లో తమ సర్వీసుకు సంబంధించిన వివరాలను ప్రస్తావించి ఉంటే వాటిని వెంటనే తొలగించాలని ఇండియన్ ఆర్మీ ఆదేశించింది. చాలామంది సైనికాధికారులు తమ ప్రొఫైల్స్‌లో సర్వీస్ వివరాలను పూర్తిగా ఇవ్వడం, ఆయుధాలతో సహా ఫొటోలు దిగి వాటిని ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టడం గమనించిన ఆర్మీ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా.. నేవీలో పనిచేసే కమాండర్ స్థాయి అధికారులు నలుగురు తమ విభాగానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఫేస్‌బుక్‌లో ప్రస్తావించినట్టు ఇటీవల నిర్ధారణ అయింది. వారిలో ఇద్దరిని డిస్మిస్ చేయాల్సిందిగా నేవీ బోర్డ్ ఆఫ్ ఇంక్వైరీ ఋాసిఫారసు చేసింది.

No comments:

Post a Comment