ఐక్యరాజ్య సమితి కార్యాలయానికి ఇటీవల చేరిన పార్శిల్ సంచుల్లో16 కిలోల విలువైన కొకైన్‌ను కనుగొన్నారు. దీని విలువ 20లక్షల అమెరికన్ డాలర్ల విలువ ఉంటుందని అంచనా. కొకైన్ సంచులున్న రెండు పార్శిల్ బస్తాలను సమితి ప్రధాన కార్యాలయంలోని తపాలా కేంద్రం వద్ద ఈ నెల 16న పోలీసులు కనుగొన్నట్టు సమితి అధికార ప్రతినిధి మార్టిన్ నెసిర్కీ తెలిపారు. మెక్సికో నుంచి వచ్చినట్టు ఆధారాలున్నా.. పంపినవారి చిరునామా లేదు. ఈ సంచులు సమితి కోసం లేదా ఇక్కడి వారి కోసం కానీ ఉద్దేశించినవి కావని, అవి దౌత్య కార్యాలయాల సంచుల్లో బట్వాడా కాలేదని నెసిర్కీ వివరించారు. మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసే వ్యక్తులే ఈ అక్రమానికి ఒడిగట్టారని మరో అధికారి పేర్కొన్నారు.
No comments:
Post a Comment