అమనుషులు పేరుతో వెబ్‌సైట్లు ఉండడం కొత్తేమీ కాదు కాని చనిపోయిన భార్య పేరుతో వెబ్‌సైట్ పెట్టడం ఇప్పటికింకా కొత్త విషయమే. ఆ కొత్త పని చేసిన వ్యక్తి ముక్తా మదన్ మెహన్. భార్య జయశ్రీ గురించి ఆయన 'ఆమె' అనే పుస్తకం రాయడమే కాక ఒక వెబ్‌సైట్ కూడా పెట్టి సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలనుకుంటున్నారు.
"జీవితంలో ఎదురయ్యే సంఘటనలు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. కష్టం నుంచి సుఖం వైపు నడిపించి మళ్లీ ఒక్కసారిగా అంతా శూన్యం అనిపించేలాగా చేయగలదు జీవితం'' అంటారు మదన్ మోహన్ అతను రాసిన 'ఆమె' పుస్తకంలో. ఈ పుస్తకం నిండా భార్య జయశ్రీతో గడిపిన 30 ఏళ్ల జీవితానుభవాలు కనిపిస్తాయి. తాను చేసిన కొన్ని తప్పులకు పశ్చాత్తాపపడుతూ, చిన్నదైనా పెద్దదైనా సంసారంలో పొరపాటుకు చోటివ్వకూడదని ఆ పుస్తకం ద్వారా మదన్‌మోహన్ పాఠకులకు చెబుతారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన అర్థాంతరంగా అర్ధాంగి దూరమైతే ఆమెకు 'ఇంకేమి ఇవ్వగలనని' తలపోస్తూ జయశ్రీ జ్ఞాపకాలను వివిధ రకాలుగా పదిలపరచడానికి ఆయన ప్రయత్నించారు. పెళ్లి నాటి నుంచి తన జీవితాన్ని జయశ్రీ ఎలా ప్రభావితం చేసిందీ 'ఆమె' పుస్తకంలో చెప్పుకున్నారాయన. కుటుంబీకులు ఆమె గురించి వెలువరించిన అభిప్రాయాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. దాన్నీ, చిన్నప్పట్నించీ లభ్యమైన ఆమె ఫోటోలనూ వెబ్‌సైట్‌లో కూడా పెట్టారు. ఆమె పేరుతో కొంతమందికైనా సహాయపడాలని మదన్‌మోహన్ అనుకుంటున్నారు.

for site click here : PAMUDURTHI
0 comments:
Post a Comment