Monday

గొంతు వింటే చాలు.. మహిళల రుతుస్రావ సమయాన్ని పురుషులు ఇట్టే పట్టేస్తారు



మహిళల గొంతు.. అదీ రికార్డెడ్ వాయిస్ విని వారు అప్పుడు 'పీరియడ్స్'లో ఉన్నారో లేరో చెప్పడం సాధ్యమేనా? న్యూయార్క్‌లోని సనీ అల్బేనీ యూనివర్సిటీ పరిశోధకులు అది సాధ్యమేనంటున్నారు. యువతుల రుతుస్రావ సమయాన్ని వారి గొంతు విని పసిగట్టగల శక్తి పురుషులకు ఉందంటున్నారు. ఈమేరకు వారు పెట్టిన పరీక్షల్లో మగవారు పాస్‌మార్కులు (35 శాతం) సాధించారు. 

ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు కొందరు పురుషులను ఎంచుకుని వారిని మూడు బృందాలుగా విభజించారు. పదిమంది మహిళలను ఎంపిక చేసుకుని, ఒక్కొక్కరి రుతుస్రావ సమయానికి సంబంధించి నాలుగుదశల్లో వారి స్వరాలను రికార్డ్ చేశారు. ఆయా రికార్డులను ఈ మూడుగ్రూపుల పురుషులకు వినిపించగా.. అమ్మాయిలు రుతుస్రావ సమయంలో మాట్లాడిన మాటలను గుర్తించమని కోరగా 35 శాతం సార్లు వారు సరిగ్గా గుర్తించగలిగారు. 

అయితే, రీసెర్చర్లు అక్కడితో ఆపలేదు. ఈసారి మరికొంతమందిని ఎంచుకున్నారు. ఈ పదిమంది మహిళల గొంతులనే వారికి వినిపించి వినడానికి అంత బాగోని స్వరాలను గుర్తించమని కోరగా.. నూటికి 34 సార్లు వారు రుతుస్రావ సమయంలో మాట్లాడిన మహిళల స్వరాలనే ఎంచుకున్నారట. మొత్తమ్మీద, రుతుస్రావ సమయంలో మహిళల గొంతు మారుతుందని, ఆ మార్పును పురుషులు చాలాసార్లు పసిగట్టగలరని పిపిటోన్ అనే పరిశోధకుడు చెప్పారు.

0 comments:

Post a Comment