ముల్లపెరియార్ డ్యాంపై సుప్రీంకోర్టు నియమించిన సాధికారిక కమిటీలోని ఇద్దరు సభ్యులు ఆ క్షేత్ర పర్యటనకు వెళ్లనున్నారు. డ్యాం పరిస్థితిపై కేరళ, తమిళనాడు రాష్ట్రాలు వినిపిస్తున్న భిన్నవాదనలపై సుప్రీంకోర్టు నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీలోని ఇద్దరు సభ్యులు అక్కడి పరిస్థితి సమీక్షించేందుకు ఈ నెలలో డ్యాంను సందర్శించనున్నారు. ఈ మేరకు సమావేశమైన సాధికారిక కమిటీ సోమవారం నిర్ణయం తీసుకుంది. ఆ రెండు రాష్ట్రాల న్యాయవాదులు తమ వాదనలు వినాల్సిందిగా కమిటీని కోరడంతో ఇద్దరు సభ్యుల బృందాన్ని డ్యాం సందర్శనకు పంపించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఆ బృందం డ్యాం సందర్శించి పరిస్థితి అంచనా వేస్తుందని, ఆ బృందం సేకరించిన అంశాలపై చర్చించేందుకు జనవరిలో మళ్లీ కమిటీ సమావేశమవుతుందని కమిటీ అధికారి ఒకరు తెలిపారు. రెండు రాష్ట్రాల అంగీకారం మేరకు డ్యాం సందర్శన తేదీలు ఖరారు చేస్తామని, ఈ వారం తర్వాత తేదీలు నిర్ణయిస్తామని ఆయన వెల్లడించారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏఎస్ ఆనంద్ నేతృత్వంలోని కమిటీ ఫిబ్రవరిలో దీనిపై నివేదికను అందించే అవకాశముంది. కాగా సోమవారం జరిగిన సమావేశంలో ఇడుక్కి జిల్లాలో తరచుగా వస్తున్న భూకంపం దృష్ట్యా 116 ఏళ్ల కిందటి డ్యాంకు ప్రమాదం వాటిల్లే ప్రమాదముందని, ఈ డ్యాం స్థానంలో కొత్త డ్యాంను నిర్మించాలని కేరళ ఆ కమిటీకి మెమొరాండం సమర్పించింది. ఈ అంశంపై కేరళ ముఖ్యమంత్రి ఒమెన్ ఛాందీ ప్రధాని మన్మోహన్ కలిశారు.
అయితే కొత్త నిర్మించాల్సిన అవసరం లేదని, ప్రస్తుత డ్యాంలో నీటి స్థాయిని పెంచాలని తమిళనాడు ఆ కమిటీ ఎదుట తన వాదన వినిపించింది. అంతేగాదు ప్రాజెక్టు భద్రత నిమిత్తం కేంద్ర బలగాలను పంపించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధానికి లేఖ కూడా రాశారు. కాగా కమిటీ సభ్యులు సీడీ థట్టే, డాకే మెహతాలు డ్యాంను సందర్శించే బృందంలో ఉన్నారు.

0 comments:
Post a Comment