అరసవెల్లి: సూర్యనారాయణ స్వామివారు కొలువున్న అరసవెల్లి దివ్య క్షేత్రంలో 10 తేదీ నుంచి 11 వ తేదీవరకు దర్శనాలు నిలిపివేస్తారు. చంద్ర గ్రహణం ఉన్న కారణం చేత ఈ దేవాలయం తలుపులు మూసివేస్తారని 10 తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మర్నాడు సూర్యోదయం తరువాత ఆరుగంటల వరకు దర్శనాలు ఉండవని అధికారులు తెలిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసాద్ పట్నాయక్ ఈ వివరాలు తెలుపుతూ ఆలయానికి సంప్రోక్షణ చేసిన తరువాత భక్తులను తిరిగి దర్శనాలకు అనుమతిస్తామని వివరించారు. |
0 comments:
Post a Comment