మానవత్వం నుండి దైవత్వంలోకి ప్రవేశించడం ''ఆధ్యాత్మికం కాదు. దైవత్వాన్ని మానవత్వంలోకి ఆవిర్భవింపజేయడమే ఆధ్యాత్మికం!
''దైవత్వం అనే ఆక్సిజన్ లోపలికి తీసుకొని ''అహంకారం అనే కార్బన్‌డై ఆక్సైడ్‌ని బైటికి పంపడమే ''మానవత్వం.
సుగుణ సంపద ద్వారా ప్రేమ ఆవిర్భవిస్తుంది. ప్రేమ ద్వారా మానవత్వం పరిమళిస్తుంది. ఈ పరమార్థాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తే, భగవంతుని దయ సంప్రాప్తించి, కొండల వంటి కష్టాలు మంచులా కరిగిపోతాయి.
మనశ్శాంతితో బతకాలంటే ఇతరుల దోషాల్ని ఎంచకుండా ఉండడం, మన ప్రవర్తనలోని లోపా లను గమనించి సరిదిద్దుకోవడం చెయ్యాలి.
మన ఇంట్లోని దీపం మనకే వెలుగునిస్తుంది. కానీ, సూర్యుని వెలుగు ప్రపంచమంతటినీ కాంతి మయంగా చేస్తుంది.
హృదయంలో ప్రేమ, స్వభావంలో శాంతం, మాటల్లో కరుణ, అందరితోనూ అన్నింటిలోనూ ఆ భగవంతుడిని చూడగలగటం ప్రేమ, వీటిద్వారా ఆధ్యాత్మిక చైతన్యం తద్వారా లోక శ్రేయస్సు కలు గుతుంది.
పొరపాట్లను గుర్తించడంలో మాత్రం వాయిదా పనికి రాదు. ఎప్పటికప్పుడు తప్పులను సరిదిద్దు కుంటూంటే, అంతకు మించి అభివృద్ధి లేదు!
అన్ని గుణములలోనూ శాంతమే ఉత్కృష్టమైనది. కోపాన్ని అదుపులో పెట్టుకుంటే, నాలుక నీ స్వాధీనంలో ఉంటే, లోకమే నీదవుతుంది!
సత్ సాంగత్యమే ఆత్మవికాసానికి మూలం. మంచి స్నేహితుల్ని కలిగి ఉండడం అదృష్టం.
నీ జీవిత సౌఖ్యం నీ ప్రవర్తన పైనే ఆధారపడి ఉంది. అందుకే అంటారు స్నేహితులు ఎటువంటి వారో తెలుసుకుంటే, ఆయా వ్యక్తుల మంచి చెడ్డలను, ప్రవర్తనను, బేరీజు వెయ్యవచ్చునని.
జ్ఞానం పెరుగుతున్న కొద్దీ, నీకు ఏమీ తెలియదని నేర్చుకోవలసినది కొండంత ఉంటే, నీకు వచ్చినది ఇసుక రేణువంత అని తెలుసుకుంటావు. అప్పుడే నీకు అభివృద్ధి కలుగుతుంది.శ్రమతో సాధించలేనిది ఏదీ లేదు. కఠిన శ్రమను చెయ్యడం ద్వారా అపజయాన్ని ఎదుర్కోవచ్చు. గౌరవం పొందవచ్చు.
ఇతరుల నుండి ఏదీ ఆశించకుండా చేసేదే ''ఉపకారం. ఈ విషయాన్ని మనం ప్రకృతిని చూసి తెలుసుకోవాలి.
ఆశ ఉంటేనే అసంతృప్తి ఉంటుంది. గమనిస్తే ప్రతి జీవీ, చెట్టూ, పుట్టా అన్నీ నిస్వార్థంగా జీవించడం ఎలాగో నేర్పిస్తాయి. ప్రకృతిని చదవగలగాలి! అంతే!

0 comments:
Post a Comment