Friday

సత్యం బలమైంది


ఆమెకు ఉండే విశ్వాసాన్ని చూస్తుంటే ఆశ్చర్య మనిపిస్తుంది. పేరు లలిత. లేతవయసులోనే ప్రభువును నమ్ముకుంది. దేవుడంటే అమిత మైన ప్రేమ, భక్తి ఉన్నాయి. దానికి తగినటు ్లగానే ఆమె ప్రవర్తన కూడా ఉంటుంది. అన్నిం టికంటే మించినది ఆమెలో ఉండే నిజాయితీ నాకెంతో నచ్చింది. 'సత్యం కోసం నేను చని పోయేందుకు కూడా సిద్ధమే అంటుంది. 'ఎవ రైనా గన్‌ని తీసుకొచ్చి నిజం చెబితే నిన్ను చంపేస్తాం అంటే ఏమాత్రం చెదరని మన సుతో 'చనిపోయినా పర్వాలేదు కానీ, అస త్యంగా మాత్రం ప్రవర్తించలేను అంటుంది.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే కొందరు అబద్ధాన్ని కూడా ఎంత చక్కగా చెబుతారంటే వారికి ఉండే ఆ కళను బట్టి విస్మయమని పిస్తుంది. అబద్ధాన్ని నర్మగర్భంగా వర్ణించి చెబుతారు. వారి భావాలు, ఆలోచనలు, ప్రవ ర్తనను బట్టి నమ్మితీరాల్సిందే. కానీ ఏదినిజమో, ఏది అబద్దమో దేవుడికి తెలుసు. దాన్ని తెలుసుకున్న దేవుడు అందుకు తగిన ఫలితాన్ని కూడా ఇవ్వకుండా చేతులు ముడు చుకోడు. 'మానక దోషములు చేయువారి వెంట్రుకలుగల నడినెత్తిని ఆయన పగుల గొట్టును (కీర్తన 68:21).

కాబట్టి మనం ఈలోకంలో మనుష్యులకు భయపడక పోయినా దేవుడికి భయపడాలి. ఒకమ్మాయి తన స్నేహితుడికి ఇలా చెబుతున్నది. 'చిన్నదానికి అబద్దం చెప్పవద్దు, పెద్ద వాట ికైతే పర్వాలేదు, కానీ చిన్నచిన్న విషయాలకు అబద్దాలు ఆడవద్దని హితోపదేశాన్ని బోధిం చింది. కాని దేవుడివాక్యం 'యధార్ధముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు (సామెతలు 11:20) చెబుతున్నది.

'అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును (12: 19). అందుకే అబద్ధాలు చెప్పేవారు క్షణాలకే మాటలను మార్చేస్తుంటారు. ఇతరుల ముందు గొప్పగా ఉండాలని, చేసిన తప్పులను కప్పిపుచ్చుకు నేందుకు, ధనాపేక్ష, ఎదుటివారి మెప్పును పొందాలని వంటి కారణాలతో తరచుగా అబ ద్ధాలు చెబుతారు. చిన్నదైనా, పెద్దదైనా, తరచుగానైనా,ఎప్పుడో ఒకసారైనా అబద్ధం అబద్ధమే. దేవుడు దాన్ని తప్పుకిందనే లెక్క కడతాడు. అది నిజం కాదని, మనం చెప్పింది సత్యదూరమని తెలిసినప్పుడు మనమెంత నిందితులుగా మిగిలిపోతామో ఆలోచించాలి.

0 comments:

Post a Comment