Sunday

ఆక్సిజన్ వయసు 248 కోట్ల ఏళ్లు

ఆక్సిజన్.. ప్రాణవాయువు లేనిదే మానవజాతి మనుగడే లేదు. మరి ఇంత కీలకమైన ఆక్సిజన్ ఈ భూమ్మీద ఎప్పుడు పుట్టిందంటారు? అంతర్జాతీ శాస్త్రవేత్తల బృందమొకటి ఈ విషయమై పరిశోధన చేసి 248 కోట్ల సంవత్సరాల క్రితమే భూమిపై ప్రాణవాయువు ఉందని తేల్చారు. వివరాల్లోకి వెళ్తే... ప్రొఫెసర్ మార్క్ బార్లే నేతృత్వలోని బృందం ఆస్ట్రేలియాలోని పిల్‌బరా రాక్స్ నుంచి తీసిన నమూనా శిలలపై పరిశోధనలు చేసింది.

ఆ బృందంలోని భూగర్భ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం భూగోళంపై తొలి ఆక్సీకరణ 248 నుంచి 232 కోట్ల సంవత్సరాల నడుమ జరిగింది. అంటే.. భూవాతావరణంలో ఆక్సిజన్ అప్పుడే ఏర్పడిందన్నమాట. బాండెడ్ ఐరన్ ఫార్మేషన్ నమూనాల నుంచి సేకరించిన క్రోమియమ్ ఐసోటోపులను, ఇతర పదార్థాలను విశ్లేషించామని, ఆక్సీకరణ జరిగిందనడానికి ఇవి బలమైన ఆధారాలనిచ్చాయని ప్రొఫెసర్ బార్లే వివరించారు.

0 comments:

Post a Comment