థైరాయిడ్ గ్రంథి సీతాకోక చిలుక ఆకారంలో మెడలో విండ్‌పైప్ ప్రాంతంలో ఉంటుంది. మన శరీరం శక్తిని ఎలా ఉపయోగించుకుంటుంది, ఎలా నిలువ ఉంచుకుంటుంది లాంటి వాటిని సరిచూస్తూ ఉంటుంది. మన శరీరంలోని కణాలన్నింటి పని తీరుని పరీక్షిస్తుంటుంది థైరాయిడ్ గ్రంథి.
థైరాయిడ్ గ్రంథి సమస్యలు, పాంక్రియాజ్ గ్రంథి సమస్యలు మనకి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొదటిది ఆడవాళ్ళలో, రెండవది మగవాళ్ళలో ఎక్కువగా కనిపించడం విశేషం.థైరాయిడ్ సమస్యలు ఇప్పుడు ఎక్కువకాలేదు. కాకపోతే కొన్ని అనారోగ్యాల అను మానంతో పరీక్షలు జరిపి థైరాయిడ్ సమస్యల్ని ఎక్కువగా కనుక్కొంటున్నారు.ప్రధానంగా థైరియిడ్‌కి వచ్చే సమస్యలు - హైపోథైరాయిడిజమ్, హైపర్ థైరాయి డిజమ్, థైరాయిడ్ కాన్సర్స్.థైరాయిడ్ గ్రంథి నుంచి హార్మోన్ ఉత్పత్తి తగ్గితే హైపోథైరాయిడిజమ్ అంటారు. హైపోథైరాయిడిజమ్ ఉన్న వాళ్ళు త్వరగా అలసి పోవడం వల్ల ప్రత్యేక లక్షణాలు కనిపించవు. క్రమక్రమంగా బాగా నీరసించిపోతుంటే తప్పక పరీక్షలు చేయించు కోవాలి. అప్పుడే ప్రాథమిక స్థాయిలో చికిత్సలు చేయించుకోగలం. అంతే కాకుండా బరువు పెరగవచ్చు.
ముఖం ఉబ్బరించవచ్చు, ఇతరులకి అనిపించకపోయినా వీళ్ళకు ‘కోల్డ్’ అనిపించవచ్చు. జుట్టు తగ్గవచ్చు , డ్రైస్కిన్, ఒళ్ళు నొప్పుడు లాంటి లక్షణాలు కనిపించవచ్చు. మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి వల్ల ఎక్కువగా హైపోథైరాయి డిజమ్ వచ్చే అవకాశముంది. ఆడవాళ్ళలో ఇది ఎక్కువ. కొన్ని మాత్రలతో కచ్చిత మైన మందుల డోస్‌లు ఇవ్వడం వల్ల హైపోథైరాయిడిజమ్‌ని అదుపులోకి తేవ చ్చు. హైపోథైరా యిడిజమ్ ఉన్న వాళ్ళకి గర్భ సమయంలో సమస్యలు రావచ్చు. కాబట్టి ఎండోక్రెనాలజిస్ట్ సలహా తీసుకోవ డం చాలా అవసరం.థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేయడం వల్ల హైపర్ థైరాయిడిజమ్ కలుగవచ్చు. ఆదుర్దా, ఇరిటేషన్, ఒణుకు, అసందర్భంగా చెమట పట్టడం, వేడిని భరించలేకపో వడం, గుండెకొట్టు కోవడం క్రమం తప్పడం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు హైపర్ థైరాయిడిజంలో కనిపించవచ్చు.
కొన్ని సందర్భాల్లో కళ్ళు ముందుకు పొడుచుకు రావచ్చు. హైపర్ థైరాయిడిజం తగ్గించేందుకు మందులు న్నాయి. హైపర్ థైరాయి డిజమ్ ఉన్న వాళ్ళు గర్భం ధరించాలనుకుంటే ఎండోక్రినాలజిస్ట్ సలహా అవసరం.థైరాయిడ్‌కి సంబంధించిన మూడవ ప్రమాదం క్యాన్సర్. మగవాళ్ళలో కంటే ఆడవాళ్ళలో థైరాయిడ్ క్యాన్సర్ ఎక్కువ. గొంతు దగ్గర వాపు కనిపించడం థైరాయిడ్ లక్షణం దానికి నొప్పి ఉండదు. ఇతర క్యాన్సర్స్‌లాగే దీనికి చికిత్స ఉంది. కాకపోతే ప్రాథమిక దశలోనే ఇబ్బందుల్ని కనుక్కోవడం చాలా అవసరం.చాలా మందికి అవయవాల మీద, సిస్టమ్స్‌మీద అవగాహన ఉండవచ్చు. గ్రంథుల మీద అవగాహన ఉండదు.
కాబట్టి గ్రంథుల నిర్మాణం, ఎక్కడుంటాయి, ఎలా ఉన్నాయి, ఏ స్థాయిలో హార్మోన్లని విడుదల చేస్తున్నాయి లాంటి విషయాల మీద అందరికీ అవగాహన ఉండాలి. థైరాయిడ్‌కి సంబంధించిన మూడవ ప్రమాదం క్యాన్సర్. మగవాళ్ళలో కంటే ఆడవాళ్ళలో థైరాయిడ్ క్యాన్సర్ ఎక్కువ. గొంతు దగ్గర వాపు కనిపించడం థైరాయిడ్ లక్షణం దానికి నొప్పి ఉండదు. ఇతర క్యాన్సర్స్‌లాగే దీనికి చికిత్స ఉంది. కాకపోతే ప్రాథమిక దశలోనే ఇబ్బందుల్ని కనుక్కోవడం చాలా అవసరం.
No comments:
Post a Comment