మధుమేహం కల స్త్రీ పిల్లలను కనాలను కుంటున్నప్పుడు అందుకు తగ్గ ప్లానింగ్ చేసు కోవాలి. గర్భాన్ని మోస్తున్నన్నాళ్ళూ డయాబెటిస్‌ని టైట్ కంట్రోల్‌లో ఉంచుకోవటమే కాకుండా క్రమం తప్పకుండా డాక్టరుకు చూపించుకుం టుండటం కూడా అవసరం.దానివల్ల పుట్టబో యే బిడ్డ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా డెలివరీ సమయంలో కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి.
మధుమేహం మూలంగా పిల్లలు కలగక పోయే సమస్య అంటూ ఏమీ ఉండదు గాని మధుమేహం మూలంగా తల్లీబిడ్డల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తే ప్రమాదం మట్టుకు లేకపోలేదు.పాపాయికి అంకురార్పణ జరిగే గర్భధార ణ దినాలలోనూ, గర్భాన్ని దాల్చిన 8 వారాల దాకానూ బ్లడ్‌గ్లూకోజ్ ఏఛఅ1ఛి స్థాయి 7 శాతాన్ని మించి ఉంటే అది కడుపులో బిడ్డ పెరుగు దలను దెబ్బతీసే ప్రమాదం ఉంది.అందుకనే గర్భిణీ స్త్రీలు ఎప్పటికప్పుడు బ్లడ్ గ్లూకోజ్ పరీక్షలు చేయించు కుంటూ డాక్టరు పర్యవేక్షణలో ఉండటం అవసరం.గర్భిణీ స్త్రీ రక్తంలో గ్లూకోజ్ అధికస్థాయిలో ఉంటే ఆమె కడుపులో ఉన్న పాపాయి రక్తంలో కూడా గ్లూకోజు అధికస్థాయిలో ఉంటుంది.
ఇందుకు కారణం ఏమిటంటే తల్లి రక్తంలోని గ్లూకోజు ‘మాయ’ ... ద్వారా కడుపులో బిడ్డ రక్తంలోకి ప్రవేశిస్తుంది. కాని ఇన్సులిన్ ఆవిధంగా ప్రవేశించలేదు.దానితో కడుపులో పాపాయి రక్తంలో గ్లూకోజ్ అధికమవుతుంది. దీనివల్ల కడుపులో బిడ్డ సాధారణం కన్నా వేగంగా బరువు పెరగటం ప్రారంభిస్తాడు.
కడుపులో బిడ్డ మామూ లుకన్నా వేగంగా పెరగటంతో శరీర పరిమాణం పెద్దగా ఉంటుంది. దీనివల్ల డెలివరీ సమయంలో ఆమె ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.అలాగే పుట్టే బిడ్డకు శ్వాస సమస్యలు కూడా ఏర్పడ వచ్చు. డెలివరీ తర్వాత బిడ్డ ‘హైపోగై ్లసీమియా’ కు లోనుకావచ్చు.టైప్ 1 డయాబెటిస్ కల స్త్రీ కడుపుతో ఉన్న రోజుల్లో బ్లడ్ షూగర్‌ని అదుపులో ఉంచుకోకపోతే రక్తంలో కీటోన్స్ అనబడే విషపదార్థాలు ఉత్పత్తి అయే ప్రమాదం ఉంది. కడుపులో ఉన్న బిడ్డకు ఈ ‘కీటోన్స్’ చాలా అపకారాన్ని కలగజేస్తాయి. చాలా అరుదే అయినా ఒకోసారి బిడ్డకు ప్రాణా పాయమూ కలగవచ్చు.
మధుమేహం గల స్త్రీ గర్భాన్ని దాల్చిన ప్పుడు ప్రెగ్సెన్సీ రోజుల్లో బ్లడ్‌షూగర్ పెరగకుం డా ఉండటానికి ఈ కింది జాగ్రత్తల్ని తీసుకో వటం అవసరం.
- న్యూట్రిషనిస్టు సలహామేర ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం
- రెగ్యులర్‌గా ఏదో ఒక యాక్టివిటీతో శరీ రాన్ని చురుకుగా ఉంచటం - వాకింగ్‌కి వెళ్ళ టం, మృదువుగా జాగింగ్ చేయటం, వగైరాలతో
- ఈ రోజుల్లో డైటింగ్ అసలు చేయకూ డదు.
- ఏదైనా అస్వస్థతలకు గురయితే రక్తంలో గ్లూకోజు స్థాయి అధికమ వుతుంది. కాబట్టి ఇట్లాంటి రోజుల్లో డాక్టరు సలహామేర ఇన్సులిన్‌ని ఇంకాస్త ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి రావచ్చు.
టైప్ 1 డయాబెటిస్ కల స్త్రీ కడుపుతో ఉన్న రోజుల్లో బ్లడ్ షూగర్‌ని అదుపులో ఉంచుకోకపోతే రక్తంలో కీటోన్స్ అనబడే విషపదార్థాలు ఉత్పత్తి అయే ప్రమాదం ఉంది.
No comments:
Post a Comment