Pages

Monday

దైవకణం ఉనికి లభ్యం? హిగ్స్‌బాసన్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు


విశ్వం పుట్టుక తదితర ప్రాథమిక రహస్యాలను వెల్లడించే దైవకణం(హిగ్స్‌బాసన్ మూలకం) ఆచూకీ లభించింది. దీనిపై శాస్త్రవేత్తలు బుధవారం ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీన్ని అధ్యయనం చేస్తున్న యూరప్‌లోని అణు పరిశోధన సంస్థ 'సెర్న్' నిర్వహిస్తున్న సదస్సు కోసం ఇప్పటికే ప్రముఖ శాస్త్రవేత్తలకు ఆహ్వానం అందింది. దీంతో 99.99శాతం కచ్చితత్వంతో దైవ కణాన్ని కనుగొన్నామని సెర్న్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పరిశోధన వర్గాలు భావిస్తున్నాయి.

దైవకణాన్ని ప్రతిపాదించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త పీటర్ హిగ్స్ కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. హిగ్స్‌బాసన్ కణాల వల్లే పరమాణువులకు ద్రవ్యరాశి ఉంటుందని, దాని వల్లే ఈ విశ్వం ఏర్పడిందని భౌతిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దైవకణం లేకపోతే అణువులు ఏర్పడం సాధ్యం కాదని, దాంతో విశ్వంలో గ్రహాల దగ్గరి నుంచి జీవం వరకు దేనికీ స్థానం ఉండేది కాదని పరిశోధకుల అంచనా. ఈ దైవకణాన్ని కనుగొనడానికి స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో 'సెర్న్' ఓ భారీ భూగర్భ పరిశోధనా కేంద్రాన్ని నిర్మించింది.

ఇందుకోసం 'లార్జ్ హాడ్రన్ కొల్లైడర్' అనే 18మైళ్ల పొడవైన సొరంగాన్ని ఏర్పాటు చేసింది. విశ్వం ఆవిర్భావానికి మూలంగా భావిస్తున్న బిగ్ బ్యాంగ్(మహా విస్ఫోటం)ను ఈ సొరంగంలో కృత్రిమంగా సృష్టించింది. రెండు ఫొటాన్ పరమాణువులను కాంతి వేగంతో ఢీకొట్టించడం వల్ల జనించే మూలకాలపై పరిశోధన జరిపింది. ఇందులో హిగ్స్ బాసన్ కణం ఉనికిని తాజాగా కనుగొన్నట్లు సమాచారం. రెండు శాస్త్రవేత్తల బృందాలు వేర్వేరుగా ఈ పరిశోధనలు జరిపాయి.

No comments:

Post a Comment