Pages

Monday

పాక్‌లో భగవద్గీతపై క్విజ్...!


పాకిస్థాన్‌లోని ఓ పాఠశాల భగవద్గీత శ్లోక పఠనంతో మార్మోగింది. హిందువులకు పవిత్రమైన భగవద్గీతపై క్విజ్ పోటీ సందర్భంగా బాలబాలికలు శ్రావ్యంగా శ్లోకాలు పఠించడంపై హిందూ మైనారిటీలలో హర్షాతిరేకాలు మిన్నుముట్టాయి. వాణిజ్య నగరం కరాచీలోని గిజ్రి ప్రాంతంలోగల శాంటా మారియా పాఠశాల వేదికగా ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా గీతా పఠనం సాగిపోవడం విశేషం.

ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగటానికి వారు ఎంతో చక్కగా సహకరించడమే కారణమని 'పాకిస్థాన్ హిందూ సేవ' (పీహెచ్ఎస్) అధ్యక్షుడు సంజేష్ థంజా చెప్పారు. కాగా, ఈ నెల 15న రాంచోర్‌లోనూ ఇలాంటి కార్యక్రమం నిర్వహించనున్నట్లు మైనారిటీల సమస్యలపై పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థతో సంబంధాలున్న ముస్లిం యువకుడు యాసిర్ కజ్మీ ప్రకటించడం గమనార్హం.

No comments:

Post a Comment