Pages

Saturday

భారత్, పాక్‌ల మధ్య శాంతికష్టం! సెనేట్ కమిటీకి నిఘా డైరెక్టర్ వివరణ


ఇరుగు పొరుగులైన భారత్, పాకిస్థాన్‌ల మధ్య శాంతి నెలకొనడం చాలా కష్టసాధ్యమని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జేమ్స్ క్లాపర్ వ్యాఖ్యానించారు. ఉభయదేశాల మధ్య ఇటీవల కాలంలో కొద్దోగొప్పో సౌహ్రార్థ వాతావరణంలో చర్చలు జరుగుతున్నట్టు కనిపిస్తున్న నేపథ్యంలో చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రాముఖ్యత ఉంది.

చర్చలు జరుగుతున్నప్పటికీ అనేక ప్రతికూలాంశాలు ఈ ప్రక్రియకు ప్రతిబంధకంగా ఉన్నాయని, వీటిని రహస్య సమావేశాల్లోనే ప్రస్తావించగలమని క్లాపర్ చెప్పారు. చర్చల పట్ల భారతీయుల్లో ఎంతో ఆసక్తి ఉందని, ఎలాగోలా ఉద్రిక్తల నుంచి ఉపశమనం పొందాలన్న ఆకాంక్ష ఉందని పేర్కొన్నారు. "ఇందుకోసం ఉభయుల మధ్య చాలాకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను అధిగమించాల్సి ఉంది. ఏదో ఒక మేరకు ఒప్పందం కుదిరినా.. అది పెద్ద ముందడుగే. అయినప్పటికీ అక్కడ అనేక ప్రతికూలాంశాలు ఉన్నాయి.

ఇది రహస్య సమావేశంలో మాట్లాడటం బాగుంటుంది.'' అని స్పష్టం చేశారు. ఈ మేరకు సాయుధ బలగాల సెనేట్ కమిటీ ఎదుట ఆయన వివరించారు. భారత్ వల్ల తనకు ముప్పు ఉందని భావిస్తున్న పాక్, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు వీలుగా విశ్వాసకల్పనకు తగిన చర్యలు తీసుకుంటోందని రక్షణ నిఘా సంస్థ డైరెక్టర్ రోనాల్డ్ ఎల్ బర్జెస్ చెప్పారు.

No comments:

Post a Comment