Pages

Saturday

తమన్నాకు బాలీవుడ్ పిలుపు


గత సంవత్సరం విడుదలైన '100%లవ్' సినిమాతో ఒక్కసారిగా బిజీ అయిపోయిన మిల్కీ వైట్ భామ తమన్నా, ఇప్పుడు కొత్త ఇబ్బందులు ఎదుర్కుంటోంది. అటు తమిళం నుంచి కూడా చాలా ఆఫర్లు వస్తుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఆమెకు ఎదురవుతోంది. ఓపక్క తెలుగులో మూడు ప్రాజక్టులతో ఫుల్ బిజీగా ఉండడంతో తమిళ సినిమాలను వదులుకుంటోంది. అక్కడికీ బాగా ఒత్తిడి రావడంతో, కోటి రూపాయల పారితోషికం మీద తాజాగా ఓ తమిళ సినిమా సైన్ చేసిందట. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నుంచి కూడా పలు ఆఫర్లు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని అంటున్నారు. తాజాగా ఒకేసారి నాలుగు హిందీ సినిమాలలో నటించే చాన్స్ వచ్చిందట. ఇందులో అజయ్ దేవగణ్ నటించే 'హిమ్మత్ వాలా' చిత్రం కూడా వుంది. అయితే, డేట్స్ సమస్య వల్ల ఇంతవరకు  ఏ హిందీ చిత్రాన్నీ ఆమె అంగీకరించలేదట! 

No comments:

Post a Comment