Pages

Saturday

దాసరి కథకి తగిన హీరోయిన్ ఎవరో ....?


దాసరి నారాయణ రావు పేరు ప్రస్తావించకుండా తెలుగు సినిమా చరిత్రను చెప్పుకోవడం చాలా కష్టం. ఆయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు అఖండ విజయాలకి ఆనవాళ్లుగా నేటికీ నిలిచి పోయాయి. అలాంటి సినిమాల్లో 'ఒసేయ్ రాములమ్మ' ఒకటి. ఈ సినిమా తరువాత దాసరి 'యంగ్ ఇండియా' ... 'పరమవీరచక్ర' ... సినిమాలను తెర కెక్కించినప్పటికీ అవి ఆశించిన విజయాలు సాధించలేదు. దాంతో మరో సామాజిక సమస్యను తెరకెక్కించేందుకు దాసరి రంగాన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సారి ఆయన తెలంగాణ ప్రాంతంలో రాజ్యమేలుతోన్న 'దేవదాసి' వ్యవస్థ దురాచారాన్నికథా వస్తువుగా తీసుకున్నారు. ఇది పూర్తిగా లేడీ ఓరియన్టెడ్ సబ్జెక్ట్ కావడంతో నటనా పరంగా బలమైన కథానాయిక ఈ పాత్రకి అవసరమౌతుంది. ఈ పాత్రకి గాను దాసరి పలువురు కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ అదృష్టం ఎవరిని వరిస్తుందో ... ఈ సినిమా ఆడియన్స్ ని ఎలా అలరిస్తుందో...! 

No comments:

Post a Comment