Pages

Saturday

అమెరికా, పాశ్చాత్యదేశాలు..కాలుష్యానికి రాజపోషకులు! నిశితంగా విమర్శించిన జయంతి నటరాజన్ పక్షులకు సెల్ టవర్ల ముప్పుపై పరిశోధకు ఆదేశం


ఎన్ని ఒప్పందాలున్నా, హామీలు ఇచ్చినా.. వాటన్నింటినీ తోసిరాజని అమెరికా, పాశ్చాత్య దేశాలు కాలుష్యాన్ని పెంచి పోషిస్తూనే ఉన్నాయని పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ ఆరోపించారు. పైపెచ్చు, ఇంత కాలుష్యాన్ని పెంచుతున్నందుకు ఏమాత్రం బాధపడకపోగా.. క్షమాపణలు కూడా చెప్పట్లేదన్నారు. 

మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రం స్వచ్ఛందంగానే కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాయని లయోలా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన బిజినెస్ ఎథిక్స్ సదస్సులో మాట్లాడుతూ చెప్పారు. డర్బన్‌లో ఇటీవల నిర్వహించిన వాతావరణ సదస్సులో భారత్ అనుసరించిన విధానాన్ని ఆమె సమర్ధించారు. అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణానికి తీరని నష్టం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. 

అభివృద్ధి చెందుతున్న దేశాలే పర్యావరణ పరిరక్షణకు ఎక్కువ కృషి చేస్తున్నాయంటూ స్టాక్‌హోమ్ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికను ఆమె ప్రస్తావించారు. 2020 నాటికల్లా ఉద్గారాలను 20 నుంచి 25 శాతం వరకు తగ్గిస్తామని మనమే స్వచ్ఛందంగా చెప్పామని, మనం ఆ దిశగా కృషి చేస్తున్నా కెనడా, జపాన్, రష్యా మాత్రం నాటి తీర్మానాలను ఏమాత్రం గౌరవించట్లేదని విమర్శించారు. 

మన దేశంలో కాలుష్యకారక పరిశ్రమలకు గరిష్ఠంగా విధించే జరిమానా కేవలం లక్ష రూపాయలేనని.. పర్యావరణం మొత్తాన్ని నాశనం చేసినవారికి ఇంత తక్కువ మొత్తం వేయడం సరికాదని అన్నారు.

No comments:

Post a Comment