Pages

Monday

సచిన్ కి 'కొలవరి' అంకితం...!


కొలవరి పాటతో కోటికొక్కడు అనిపించుకున్న ధనుష్, మరోసారి ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక విషయంలోకి వెళ్తే ... సచిన్ టెండూల్కర్ 'బూస్ట్' అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి 'బూస్ట్' ప్రమోషన్ కోసం సచిన్ పై  కొలవరి టైపు సాంగొకటి చేసిపెట్టమని ఆ సంస్థ కోరడంతో, సచిన్ కి వీరాభిమాని అయిన ధనుష్ వెంటనే స్వరం బిగించాడట! రీసెంట్ గా రైల్వేస్టేషన్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించిన ఈ పాటలో ధనుష్ పక్కన అందాల  అనుష్కా కూడా స్టెప్పులేసినట్టు తెలుస్తోంది. ఓ వైపున ఈ పాటని సచిన్ కి అంకితం చేశానని ధనుష్ చెపుతుంటే ... మరో వైపు నుంచి పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకున్నాడనే గుసగుసలూ వినిపిస్తున్నాయి.

No comments:

Post a Comment