Pages

Monday

ప్రభాస్ హీరోగా 'అగ్నిపధ్' రీమేక్...?


ఇటీవల హిందీలో వచ్చిన 'అగ్నిపధ్' చిత్రాన్ని రామ్ చరణ్ తెలుగులో రీమేక్ చేసే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం మీద చరణ్ ప్రశంసల వర్షం కూడా కురిపించాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ చిత్రం మీద మనసు పడ్డాడని తెలుస్తోంది. గతంలో తాను నటించిన 'ఛత్రపతి' సినిమా స్థాయిలో 'అగ్నిపధ్' వుండడం వల్ల తన పర్శనాలిటీకి అది బాగా సూట్ అవుతుందని ప్రభాస్ భావిస్తున్నాడట. మాస్ ప్రేక్షకులు ఇష్టపడే  యాక్షన్ అంశాలు ఆ హిందీ సినిమాలో పుష్కలంగా వుండడం వల్ల తప్పకుండా అది తెలుగు ప్రేక్షకులకి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాడు. దాంతో, హిందీ సినిమా రీమేక్ హక్కుల్ని తీసుకోమని తన నిర్మాతలకు ప్రభాస్ చెప్పాడట. ప్రస్తుతం ఆయన నిర్మాతలు ఆ పనిలోనే వున్నారని టాలీవుడ్ తాజా సమాచారం.  

No comments:

Post a Comment