Pages

Saturday

క్యూబాలో విహరిస్తోన్న ప్రేమజంట


బాలీవుడ్ పాత ప్రేమికులు సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ జంట ఈమధ్య మళ్లీ రాసుకుపూసుకు తిరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. అంతేకాదు... కలిసి మళ్లీ 'ఏక్ థా టైగర్' అనే సినిమా కూడా చేస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా తాజా షెడ్యూలు క్యూబాలో జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేషాలను ఇండియా -  ఇరాక్ -  టర్కీ -  ఐర్లాండ్ లలో చిత్రీకరించారు. మిగతా కీలకమైన సన్నివేషాలను క్యూబాలో షూట్ చేస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత సల్మాన్ - కత్రినల కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటం ... ఈ బ్యానర్ పై సల్మాన్ కి ఇది తొలి చిత్రం కావడం ఈ సినిమా కి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆగస్ట్ లో ఈ సినిమాని అభిమాన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

No comments:

Post a Comment