మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం కనుగొనబడిన పద్ధతి యోగా. పర్సనల్ డెవలప్‌మెంట్ అనే విషయానికి సంబంధించిన అతి పురాతనమైన పురాతనమైన పద్ధతి. దీనిలో మన పురాతన యోగాలు ఒక మనిషి తనతో పాటు, తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఒక ప్రశాంత జీవితం జీవించడానికి కనుగొనబడిన పద్ధతి. మన శరీరం ఒక యంత్రం అయితే, మన మెదడు దానిని నడిపే డ్రైవర్ లాగా పని చేస్తుంది. ఈ రెండింటి మధ్య సమన్వయం కుదర్చుడమనేదే ‘యోగ’.
హలాసనం
హలం అంటే నాగలి. నాగలిని పోలి ఉంటుంది కాబట్టి దీనికి ‘హలాసనం’ అనే పేరు వచ్చింది.
పద్ధతి : 1. వెల్లకిలా నేల మీద పడుకోవాలి.
2. గాలి పీల్చుకొని నెమ్మదిగా గాలి వదులుతూ రెండు కాళ్ళను సమాంతరంగా లేపి తలమీదుగా వెనక్కి తీసుకెళ్ళి భూమి మీద ఆన్చాలి. మొదట చేసేటప్పుడు చేతుల సపోర్టు నడుము దగ్గర తీసుకోవచ్చు.
3. చేతులు సపోర్ట్ అవసరం లేదనుకుంటే కింద పెట్టవచ్చు. రెండు మోకాళ్ళు వంచకుండా ఉండాలి. ఆసన స్థితిలో నెమ్మదిగా గాలి పీల్చుకుని వదులుతూ ఉండాలి. ఇలా ఉండగలిగినంత సమయం ఉండి నెమ్మదిగా యథాస్థితికి రావాలి.
4. కాళ్ళు రెండూ నేలకు ఆనేవరకు మోకాళ్ళు వంచకూడదు.
5. ఆసనం తర్వాత శవాసనంలో రిలాక్స్ అవ్వాలి.
6. మొదట 20 సెకన్ల నుంచి మొదలుపెట్టి నెమ్మదిగా ఆసనస్థితిలో ఉండే సమయం పెంచాలి.
7. మొదట కాళ్ళు నేలకు ఆనకున్నా... ప్రయత్నం మీద సాధించవచ్చు.
ఉపయోగాలు :1. హలాసనం ఉపయోగాలు చాలా ఉన్నాయి. కాలిలో ఉన్న అన్ని కండరాలు, లిగమెంట్లు బాగా స్ట్రెచ్ చెయ్యబడడం వలన ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. లెగ్ క్రాంప్స్‌తో బాధపడే వారికి ఇది చాలా ఊరటనిస్తుంది.
2. పొట్ట భాగం కుంచింపబడడం వలన ఆసనస్థితి నుంచి బయటికి వచ్చినప్పుడు ఒక్కసారిగా రక్తవూపసరణ పెరుగుతుంది. టాక్సిన్లు బయటికి వదలివేయబడుతాయి. ఇదే విధమైన స్థితి మెడ వద్ద, ఊపిరితిత్తుల వద్ద కూడా జరుగుతుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అవయవాలకు సరఫరా చెయ్యబడుతుంది.
3. నిద్రపోయినపుడు వెన్నెముక కంప్రెస్ చెయ్యబడినట్లు, స్టిఫ్ అయినట్లు అనిపించినపుడు ఉదయం లేవగానే వార్మ్ అప్స్ తర్వాత హలాసనం ప్రాక్టీస్ చెయ్యవచ్చు.
4. థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరుస్తుంది.
5. లివర్, కిడ్నీల పనితీరును ఉత్తేజితం చేస్తుంది.
కర్ణ పీడాసనం
హలాసనం వేరియేషన్స్‌లో ఒకటిగా పిలిచేది కర్ణపీడాసనం. ఇది హలాసనం వేరియేషన్స్‌లో చాలా అడ్వాన్స్‌డ్ వెర్షన్.
పద్ధతి: 1. హలాసనం స్థితి నుంచి గాలి వదలి వేస్తూ రెండు మోకాళ్లనూ తలకు పక్కగా వచ్చేటట్లు ఉంచి కాలి వేళ్లు భూమికి ఆనేటట్లుగా పెట్టాలి.
2. రెండు చేతులనూ నడుం ముందుకు తీసుకెళ్లి రెండు చేతి వేళ్లను ఒకదానితో ఒకటి పెనవేయాలి.
3. ఇదే స్థితిలో 30 సెకన్ల వరకు గాలి పీలుస్తూ ఉండాలి. ఆ తర్వాత యథాస్థితికి రావాలి.
ఉపయోగాలు:1. ఉదరంలోని భాగాలన్నింటికి మంచి మసాజ్ అవుతుంది.
2. ఒత్తిడి, అలసటను బాగా తగ్గిస్తుంది.
3. ఉత్తేజాన్ని కలిగిస్తుంది.
4. సైనస్ ప్రాబ్లమ్ నుంచి, ఆస్త్మా నుంచి బయటపడేస్తుంది.
5. మెనోపాజ్ వలన కలిగే దుష్ఫలితాలు నుంచి తప్పించుకోవచ్చు.
6. వెన్నెముక అంతటికీ చాలా ఉపయోగం.
జాగ్రత్తలు:1. మెడనొప్పి ఉన్నవారు చెయ్యకూడదు.
2. హైబీపీ, ఆస్త్మా ఉన్నవారు నిపుణుల ఆధ్వర్యంలో మాత్రమే చేయాలి.
హలాసనం వేరియేషన్ - 3
హలాసనం స్థితిలోనే ఉండి రెండు కాళ్లను వీలున్నంతగా దూరం జరపాలి. ఇదే స్థితిలో 30 సెకన్లు ఉన్న తర్వాత తిరిగి హలాసనం స్థితికి రావాలి.
హలాసనం వేరియేషన్ - 4
హలాసనం స్థితిలో నుంచి ఒక కాలిని నెమ్మదిగా పైకి 90డిక్షిగీల కోణంలో లేపాలి. ఇది కొద్దిగా కఠినతరమైంది. కాబట్టి నెమ్మదిగా సాధన మీద సాధించవచ్చు.

No comments:
Post a Comment