యోగా తత్త్వాన్ని అనుసరించి ఒక మనిషి వయసు అతని వయసును బట్టి కాక... అతని వెన్నెముక ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉందన్న దాన్నిబట్టి నిర్ధారణకు రావచ్చు. యోగా వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింప చేస్తుంది. వెన్నెముక ఎలాస్టిసిటీ పెంచుతూ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. టెన్షన్‌ను తగ్గిస్తుంది. యోగా మన శరీరంను డైనమైట్‌లాగా శక్తివంతం చేస్తుంది.
విపరీతకరణి
ముసలి తనాన్ని, చావును కూడా జయించగలిగే శక్తి ఈ వివరీతకరణికి ఉంది (గెరాండ్‌సంహిత 3.36)
వేరియేషన్ - 1
1. వెల్లకిలా భూమిమీద పడుకోవాలి. రెండు కాళ్ళు ఒకదానికొకటి సమాంతరంగా ఉండాలి.
2. రెండుకాళ్ళనూ మోకాళ్ళను ముందుకు పైకి లేపాలి.
3. తల వైపుగా రెండు కాళ్ళనూ ముందుకు తీసుకెళ్ళాలి.
4. చేతులు రెండింటి సహాయంతో నడుమును పైకి లేపాలి.
5. నడుము భాగం రెండు అరచేతుల మధ్య ఉండేటట్లు, మోచేతులు భూమి మీద ఉండేట్లు చూసుకోవాలి.
6. మోచేతులు శరీరంకు వీలున్నంత దగ్గరగా ఉండాలి.
7. ఫైనల్ పొజిషన్‌లో శరీరపు బరువు మొత్తం భుజాలు, మోచేతులు మీద ఉంటుంది.
8. కళ్ళు మూసుకొని ఉండగలిగినంత సమయం రిలాక్స్‌గా ఆసన స్థితిలో ఉండాలి.
9. నెమ్మదిగా వెన్నెముకను భూమి మీద ఆన్చుతూ తిరిగి యథాస్థితికి రావాలి. తలను పైకి లేపకుండా కాళ్ళను కింద పెట్టాలి. ముందుకు నడుము భాగం తర్వాత కాళ్ళు భూమి మీద ఆన్చాలి.
10. శవాసనంలో రిలాక్స్ అవ్వాలి.
11. కొత్తలో కొన్ని సెకన్లతో మొదలుపెట్టి నెమ్మదిగా 3 నుంచి 5 నిమిషాల వరకు ఈ స్థితిలో ఉండవచ్చు.
వేరియేషన్ : 2
రెండు కాళ్ళను నడుమును ఒకే దిశలో తల వైపు కాకుండా తలకు ఎదురుగా ఆపి ఉంచాలి.
ఉపయోగాలు :
- రక్తం శుద్ధిచేస్తూ మెదడుకు రక్తవూపసరణను ఎక్కువ చేస్తుంది.
- శక్తిని వృద్ధి చేస్తూ, శరీరానికి మెరుపును ఇస్తుంది.
- శ్వాస కోశ వ్యవస్థ బాగా పని చేస్తుంది.
- భయాలను, ఒత్తిడిని, తలనొప్పులను బాగా తగ్గిస్తుంది.
సర్వాంగాసనం
సంస్కృతంలో ‘సర్వ’ అనగా అన్ని ‘అంగ’ అనగా భాగాలు. మొత్తం శరీర భాగాలన్నింటికీ ఈ సర్వాంగాసనం చాలా ఉపయోగకరం. హఠయోగ పద్ధతిలో దీనిని ఒక మహత్తరమైన ఆసనంగా పరిగణిస్తారు. ఈ ఆసనం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలు బలోపేతం అవుతాయి. కాబట్టే శీర్షాసనం తర్వాతి స్థానం ఈ సర్వాంగాసనానికే దక్కుతుంది.
1. వెల్లకిలా పడుకోవాలి.
2. గాలి పీల్చుకుని వదలివేస్తూ ఒక నిమిషం రిలాక్స్ అవ్వాలి.
3. గాలి పీల్చుకుని రెండు కాళ్లనూ 90డిక్షిగీల వరకు పైకి లేపాలి.
4. ఇప్పుడు గాలి వదలివేస్తూ నడుము భాగాన్ని, పొట్టభాగాన్ని భూమి మీద నుంచి పైకి లేపాలి.
5. రెండు చేతులతో నడుము వద్ద సపోర్ట్ తీసుకుంటూ మొత్తం శరీర భాగాన్ని నేలకు లంబకోణంలో నిటారుగా నిలపాలి. రెండు మోకాళ్లనూ వంచకుండా ఉండాలి. దృష్టిని కాలి వేళ్లమీద నిలపాలి.
6. ఈ స్థితిలో ఉండగలిగినంత సమయం ఉండి, ఊపిరి మామూలుగా పీల్చుతూ ఉండాలి.
7. నెమ్మదిగా వెన్నముకను భూమి మీదకు ఆన్చుతూ ముందుగా వీపు, నడుము, చివరగా కాళ్లు భూమి మీదకు తీసుకుని రావాలి.
8. శవాసనంలో రిలాక్స్ అవ్వాలి.
ఉపయోగాలు :
- విపరీతకరణిలో ఉన్న అన్ని ఉపయోగాలు దీనిలో కూడా ఉంటాయి.
- శరీరంలో శక్తిని ఇనుమడింపచేస్తుంది. జుట్టు రాలడం నివారిస్తుంది.
- థైరాయిడ్ గ్రంథి ఉత్తేజితం అవుతుంది.
- ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్తం శుద్ధి చేస్తుంది.
-మెదడుకు రక్తవూపసారాన్ని ఎక్కువ చేస్తుంది.
జాగ్రత్తలు :
- సరై్వకల్ స్పాండిలైటిస్, స్లిప్ డిస్క్, హైబీపీ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు చెయ్యకూడదు.
- మెన్సెస్ ఉన్న మసయంలో చేయరాదు.
గమనిక
యోగా సాధనకు ముందు వార్మ్ అప్ ( సూక్ష్మవ్యాయామాలు) తప్పనిసరి. నిపుణుల ఆధ్వర్యంలో చెయ్యాలి.

No comments:
Post a Comment