Pages

Friday

ఇక 'శాటిలైట్ నిఘా'లో డ్రైవింగ్ లైసెన్సుల జారీ ఎంవీఐల ఇష్టారాజ్యానికి చెక్ తొలి సమావేశంలో సాధికార కమిటీ నిర్ణయం


డ్రైవింగ్ లైసెన్స్ జారీ ఇక కఠినతరం కానుంది. ఇప్పటివరకూ ఎంవీఐ(మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్)ల ఇష్టారాజ్యంగా నడిచిన లైసెన్సుల జారీ విధానంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇకపై 'శాటిలైట్ ని ఘా' నీడలోనే డ్రైవింగ్ లైసెన్సులు జారీ అవుతాయి. అం తేకాదు.. లైసెన్సుల జారీలో భాగంగా జరిగే ముందస్తు ప రీక్షలు సైతం ప్రస్తుతం కం ప్యూటర్‌లపై నిర్వహిస్తుండ గా.. ఇవి కూడా ఇకపై 'సిమ్యులేటర్ల'పైనే జరగనున్నా యి. వీటిని ముందుగా హైదరాబాద్, రంగారెడ్డిసహా విజయవాడ లేదా విశాఖపట్నంలో ఒక చోట పైలట్ ప్రా జెక్టులుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించినట్లు సమాచారం. 

రవాణా వ్యవస్థ స్థితిగతులపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కేంద్ర రెండో పరిపాలనా సంస్కరణల కమిటీ సమావేశం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ హీరాలాల్ సమారియా అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న 'డ్రై వింగ్ టెస్ట్'ల విధానం లోపభూయిష్టంగా ఉండడం, లై సెన్సుల జారీకి ఎంవీఐలు ఇష్టారాజ్యంగా సిఫారసు చే స్తుండడం, డ్రైవింగ్ టెస్ట్‌లకు సంబంధించి చాలాచోట్ల ట్రాక్‌లు పరిపూర్ణంగా లేకపోవడం, ఉన్నప్పటికీ 'టెస్ట్'లు శాస్త్రీయ పద్ధతుల్లో జరగకపోవడం వంటి అంశాలపై ప్రత్యేకంగా ఏర్పాటైన ఈ కమిటీ పరిశీలిస్తోంది.కమిటీ తన తొలి సమావేశంలో ఈ 'పరిస్థితులు'పై లోతుగా చ ర్చించింది. 

ఈ కమిటీ సిఫారసులను ప్రధానికి, మార్ట్(మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ హైవే ట్రాన్స్‌పోర్ట్)కు వెల్లడించే ముందు మరో ఉన్నతస్థాయి కమిటీ కూడా సమీక్షిస్తుంది. డ్రైవింగ్ లైసెన్సుల జారీలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. 'శాటిలైట్ నిఘా' ద్వారా అభ్యర్ధి సామర్ధ్యాన్ని పరీక్షిస్తారు. ఇందుకోసం డ్రైవింగ్ ట్రాక్‌ల్లో 'ఆర్ఎఫ్ఐడీ టెక్నాలజీ'ని ప్రవేశపెట్టనున్నారు. డ్రైవింగ్ టెస్ట్‌ల కోసం ఇటీవల కొన్ని సంస్థలు వాడుతున్న జీపీఎస్ విధానాన్ని పరిశీలించేందుకు నిర్ణయించారు. దీని ద్వారా అభ్యర్ధి సామర్ధ్యాన్ని సాంకేతికంగా లెక్కించిన తర్వాతే లైసెన్సుల జారీ జరుగుతుంది. ఈ టెస్ట్‌కు ముందు జరిగే ముందస్తు పరీక్షలను కూడా 'సిమ్యులేటర్ల'పైనే నిర్వహిస్తారు.

No comments:

Post a Comment