Pages

Saturday

వికీలీక్స్ దెబ్బకు నిఘా సంస్కరణలు శ్రీకారం చుట్టిన అమెరికా


అమెరికాకు చెందిన అధికారిక రహస్య పత్రాలను ఎవరూ తస్కరించకుండా తగిన జాగ్రత్తలతో సంస్కరణలు అమలు చేయాలని నిఘా సంస్థ అధికారులు ప్రయత్నిస్తున్నారు. వం దలవేల రహస్యపత్రాలను వికీలీక్స్ బహిర్గతం చేసిన నేపథ్యంలో నిఘా అధికారులు ఈ చర్యలు చేపట్టారు. సువ్యవస్థితమైన భద్రతా విధానాన్ని రానున్న ఐదేళ్లలో అమలుచేయడం జరుగుతుందని జాతీ య నిఘా డైరెక్టర్ జేమ్స్ క్లాపర్ చెప్పారు. ఈ వి«ధానంలో అమెరికా రహస్యాలను తెలుసుకోవడం లేదా బహిర్గతంచేయడం కుదరదని తెలిపారు.

దౌత్యపరమైన, సైనికపరమైన సందేశాలు బహిర్గతం కావడం తో భద్రతా వ్యవస్థకు మార్పులు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇదే సమయంలో సమాచారం సురక్షితంగా ఉండటంతోపాటు పెద్దగా అవరోధాలు లేకుండా ఈ సమాచారాన్ని ఇతరులతో పంచుకునేలా భద్రతాచర్యలు ఉండాలని అమెరికా అధికారులు భావిస్తున్నారు.

అమెరికాకు చెందిన అధికార రహస్య పత్రాలను 2010 జూలై నుంచి వికీలీక్స్ వెబ్‌సైట్ వెల్లడించడం ప్రారంభించింది. తాము సేకరించిన మొత్తం రహస్య పత్రాలను 2011 సెప్టెంబర్‌లో ఒక్కసారిగా బహిర్గతం చేసిం ది. ఈ చర్యలు అమెరికాకు ఇబ్బందిగా మారాయి. ఈ క్రమంలో రహస్యపత్రాలను వీకీవీక్స్‌కు చేరవేశారన్న ఆరోపణలతో బ్రాడ్‌లీ మానింగ్ అనే సైనిక ఉద్యోగిని కోర్టు మార్షల్ చేయాలని అమెరికా సైనిక ట్రిబ్యునల్ అ«ధికారి ఈ నెల మొదట్లో సూచించారు.

No comments:

Post a Comment