ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఓ ఆస్పత్రి బయట జరిగిన ఆత్మాహుతి దాడిలో 31 మంది మరణించారు. మరో 60 మంది గాయపడ్డారు. షియా ముస్లింలపై దాడులు తప్పవని అల్‌కాయిదా హెచ్చరించిన కొద్ది రోజులకే ఈ దాడి జరిగింది. గురువారం హత్యకు గురైన ఓ వ్యక్తి అంతిమయాత్ర తూర్పు బాగ్దాద్‌లోని జఫ్రానియా ఆస్పత్రి మీదుగా సాగుతున్న సమయంలో మధ్యాహ్నం 1.30 సమయంలో ఈ దాడి జరిగింది. మృతుల్లో 8 మంది భద్రతా దళాధికారులు, నలుగురు మహిళలు కూడా ఉన్నారు.
No comments:
Post a Comment