Pages

Tuesday

వెన్నునొప్పి సమస్యకు కటివస్తి..గ్రీవస్తి

కేస్ స్టడీ అతని పేరు అశోక్. వయసు 35. వృత్తిరీత్యా ఆర్టీసి కండక్టర్. కొంతకాలంగా మెడనొప్పి, నడుము నొప్పితో బాధపడుతున్నాడు. ఉన్నట్లుండి ఒక రోజు ఉదయం మేలుకోగానే శరీరమంతా బిగుసుకు పోయినట్లయ్యింది. కదల్లేని పరిస్థితి ఏర్పడింది. కాళ్లూ చేతుల్లో తిమ్మిర్లు, పిక్కలు పట్టేయడంతో పాటు కాళ్లల్లో నొప్పి.

పొడిచినట్లు ఉండడం, మొద్దుబారినట్లు ఉండడం వంటి లక్షణాలు కనిపించాయి. వీటన్నిటినీ మించి మూత్ర విసర్జన ఆగిపోయింది. ఆర్థోపెడిక్ డాక్టర్ వద్దకు తీసుకు వెళితే ఎంఆర్ఐ తీసి, మెడ పూసలు, డిస్కులు (సి4-సి5, సి5-సి6, సి6-సి7) దెబ్బ తిన్నాయని చెప్పి, వెంటనే మెడ భాగంలో శస్త్ర చికిత్స చేశారు. వాస్తవానికి ఎంఆర్ఐ రిపోర్టులో న డుము భాగంలోని డిస్కుల్లోనూ సమస్య ఉన్నట్లు తేలింది.

కానీ, డాక్టర్ మెడనొప్పికే ప్రాధాన్యతనిచ్చి ఆ భాగంలోనే శస్త్ర చికిత్స చేశారు. అయితే, శస్త్ర చికిత్స తరువాత మెడ నొప్పి తగ్గకపోగా ఎక్కువయ్యింది. పైగా, ఆ తరువాత కొద్ది రోజులకే నడుము నొప్పి తీవ్రం కావడం మొదలయ్యింది. శస్త్ర చికిత్స తరువాత కలిగిన ప్రయోజనమంతా మూత్ర విసర్జనలోని అంతరాయం తొలగిపోవడం ఒక్కటే. మిగతా సమస్యలన్నీ అలాగే ఉండిపోయాయి. ఉన్న నొప్పితో పాటు, కాళ్లు, పిక్కలు పట్టేయడం, చురుకులు, పోట్లు, మంటలు, తిమ్మిర్లు మరీ ఎక్కువయ్యాయి. వీటికి తోడు శరీరంలో ఒక వైపంతా స్పర్శ కోల్పోవడం వంటి లక్ష ణాలు కనిపించాయి. మళ్లీ డాక్టర్ వద్దకు వెళితే, నడుము భాగంలో కూడా శస్త్ర చికిత్స చే యాలని చె ప్పారు. కానీ, రెండవ సారి శస్త్ర చికిత్స చేయించుకోవడం ఇష్టంలేక ఆయన మా వద్దకు వచ్చాడు.

జీవన శైలితో తంటా
మౌలికంగా ఈ సమస్యలన్నీ వాతం ప్రకోపం చెందడం వల్లే వస్తాయి. అయితే సమస్యలు మెడ భాగంలో వస్తే గ్రీవగత వాతమని, నడుము భాగంలో వస్తే కటీగత (గృద్రసీ) వాతమనీ అంటారు. ఆయుర్వేద వైద్య విధానంలో వ్యాధి పూర్వ చరిత్ర అధ్యయనానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. వ్యాధి పరిశీలనలో మొత్తంగా . 

నిదానం, పూర్వరూపం, రూపం, ఉపశయం, సంప్రాప్తి అనే ఐదు దశలు ఉంటాయి. వ్యాధి రావడానికి గల మౌలిక కారణాన్ని నిదానమని, వ్యాధి రావడానికి ముందు సూక్ష్మస్థాయిలో కనిపించే లక్షణాలను పూర్వరూపమంటారు. వాస్తవానికి ఈ వ్యక్తికి సమస్య మరీ తీవ్రం కావడానికి ముందు నుంచే కాళ్లు పట్టేయడం వంటి కొన్ని లక్షణాలు ఉండేవి. అదే పూర్వ రూపం. కాకపోతే ఆ లక్షణాలను పట్టించుకో లేదు. పైగా ఆ జీవన శైలి కూడా ఈ సమస్యా కారకంగానే ఉంది. కండక్టర్‌గా రోజూ దాదాపు ఓ 10 గంటల పాటు నిలుచునే ఉంటాడు.

పయనించే, బస్సు కదలికలన్నిటికీ ఆయన రోజంతా ప్రభావితం అవుతూనే ఉంటాడు. దీని వల్ల నడుము, మెడ భాగాల్లో కొన్ని లోపాలు ఏర్పడుతూ వచ్చాయి. దీనికి తోడు ఒక రోజు బైక్ మీది నుంచి పడిపోయాడు కూడా. ఆ తరువాత రెండు మూడు రోజులకే ఇది మెడ నొప్పి, నడుము నొప్పి హఠాత్తుగా తీవ్రమై మంచం పట్టాడు. మంచం మీద వాలిపోయి ఉన్నంత సేపు బాగానే ఉంటుంది. లేచి ఓ 5 నిమిషాలు నిలబడితే చాలు మెడ, నడము భాగాల్లో నొప్పి మొదలవుతుంది. నొప్పికి తోడు కండరాలన్నీ బిగుసుకుపోతాయి. చీమలు పాకినట్లు, సూదులతో గుచ్చినట్లు నిరంతరం బాధ ఉంటుంది. ఒక కాలు, ఒక చేయి, శరీరం మొత్తంలో సగ భాగం స్పర్శ కోల్పోయిన స్థితి.

వైద్యవిధానం
వాస్తవానికి, నొప్పి అనేది ఆ ఒక్క భాగానికి, అక్కడున్న కండరాలకు మాత్రమే పరిమితమైనది కాదు. నొప్పి అనేది మొదలయ్యిందీ అంటే అక్కడ కొన్ని రసాయనాల ప్రతిక్రియలు జరుగుతాయి. ఆ ప్రతిక్రియలు కండరాలు, డిస్కులతో పాటు లిగమెంట్లు, టెండాన్లు, ఎముకలు, మొత్తం వెన్నెముక అంతా జరుగుతాయి. అందువల్ల దెబ్బ తిన్న ఆ ఒకటి రెండు డిస్కులు, అక్కడున్న కొన్ని కండరాలకు పరిమితమైపోయి చికిత్స చేస్తే, అది సగమే అవుతుంది.

అందువల్ల మొత్తం వెన్నెముకను ఆ మాటకొస్తే మొత్తం శరీరవ్యవస్థనంతా చికిత్సలోకి తీసుకోవాలి. అలా తీసుకోవడానికి మౌలికంగా శరీర ప్రకృతిని వాత, పిత్త, కఫాల్లో ఏది అని అధ్యయనం చేయడం చాలా ముఖ్యం. ఇలాంటి సమస్యల్లో వైద్య చికిత్సలను ముందుగా, బాహ్యం నుంచి ప్రారంభించాలి. అంటే, చ ర్మం, కండరాలు, టెండాన్లు, లిగ్‌మెంట్ల నుంచి మొదలెట్టాలి. ఇవన్నీ కండరాల వ్యవస్థలో భాగమే. ఈ వ్యవస్థను సహజ స్థితికి తేవడానికి అభ్యంగ, స్వేద చికిత్సలు అవసరమవుతాయి. అభ్యంగ చికిత్సలో శరీరంలోని 107 మర్మాలను చైతన్యపరిచేందుకు తైలమర్ధనం చేస్తాం. దీనివల్ల శరీర భాగాలన్నిటికీ రక్తప్రసరణ పెరుగుతుంది. అలాగే శరీర ధర్మాలన్నీ సహజ స్థితికి వస్తాయి. ఇలా డిస్కుల్లో సమస్యలు ఉన్న వారికి కటివస్తి, గ్రీవస్తి చికిత్సలు చేయవలసి ఉంటుంది. 

మౌలికంగా కండరాల వ్యవస్థలో గానీ, వెన్నెముకలో గానీ, ఏదైనా సమస్య ఉత్పన్నం కావడానికి వాతం పెరగడమే కారణం. వాతం పెరగ డానికి మౌలికంగా దాని మార్గంలో అవరోధం అంటే నరాలు ఒత్తిడికి గురికావడం, లేదా దెబ్బ తినడం, లేదా ధాతువులు క్షీణించడం ఈ రెండే కారణాలు ఉంటాయి. వృత్తిపరమైన కారణాల వల్ల ఇతనిలో ధాతుక్షయం జరుగుతూ వచ్చింది. దీనికి తోడు బైక్ మీది నుంచి కింద పడటం వల్ల మార్గావరోధం ఏర్పడింది. ఈ స్థితిలో కటివస్తి, గ్రీవస్తి చికిత్సల ద్వారా మార్గావరోధాన్నీ, ధాతుక్షయాన్ని అరికట్ట వలసి ఉంటుంది.

ఇది వెన్నెముక మీద ఉన్న ఒత్తిడి తొలగిపోతుంది. వీటితో పాటు నవరకిడి, సర్వాంగ ధార చికిత్సకూడా ఉంటుంది. అలాగే వాతాన్ని హరించే విశేష చికిత్స వస్తికర్మ కూడా తప్పనిసరి. ఇవ న్నీ కండరాల వ్యవస్థనూ నరాలవ్యవ స్థనూ, శక్తి వంతం చేసి, వెన్నెముకకు అనుబంధంగా ఉన్న ఇతర నిర్మాణాలన్నిటినీ ఏకకాలంలో చైతన్య పరుస్తాయి. ఈ కారణంగానే అల్లోపతిలా తాత్కాలిక ఉపవమనాన్ని కాకుండా ఆయుర్వేదం శాశ్వత ఫలితాలను ఇస్తోంది. ఈ చికిత్సలన్నీ సంపూర్ణంగా తీసుకోవడం వల్ల అశోక్ సమస్యలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు అతడు ఒక కొత్త ఉత్సాహంతో తన విధులకు హాజరవుతున్నాడు.

1 comment:

  1. Wonderful information. Would you please suggest names of some good ayurveda doctors in Hyedrabad area?

    ReplyDelete