Pages

Tuesday

భలే బుల్లి కారు


ప్రపంచంలోనే వేగంగా ప్రయాణించే కారు గురించి విన్నాం.. ఖరీదైన కారు గురించి తెలుసుకున్నాం. మరి ప్రపంచంలోనే చిన్న కారు గురించి? ఇదిగో ఈ కారే. మీ ఇంటి మందు ఓ ఐదడుగుల స్థలం ఉంటే చాలు చక్కగా నిలబడిపోతుంది. మీ వీధి చిన్నగా ఉన్నా సరే తాపీగా పరుగులు తీయగలదు. ఎందుకంటే అంత చిన్నగా ఉంటుంది కనుక. పీల్ అనే బ్రాండ్ పేరుతో 1962 నుంచి 65 మధ్యలో పీల్ ఇంజెనీరింగ్ కంపెనీ వీటిని తయారు చేసింది. అదీ పరిమిత సంఖ్యలోనే. ఆ తర్వాత వీటి తయారీని నిలిపివేశారు. తక్కువ కార్లను తయారు చేసిన ఆటోమొబైల్ కంపెనీగా గిన్నిస్ రికార్డ్ కూడా నమోదైంది.

చిన్న కారు కదా ఎక్కువ మందికి వీటి అవసరం ఉందని భావించిన యూకే వ్యాపారస్థులు ఇద్దరు ఈ బ్రాండ్ హక్కులను కొనుగోలు చేశారు. వీరు కూడా పరిమిత సంఖ్యలోనే తయారు చేస్తారట. ఈ చిన్ని కారు పి50, ట్రైడెంట్ పేరుతో రెండు రకాల మోడళ్లలో కనిపిస్తుంది. ఈ రెండు మోడళ్లలోనూ కేవలం ఒకరు మాత్రమే ప్రయాణించగలరు. పక్కనే లగేజ్ పెట్టుకోవడానికి కొంత స్థలం ఉంటుంది. ఇరుక్కుని ఇద్దరు కూడా కూర్చోవచ్చు. విద్యుచ్ఛక్తితో న డిచే వీటికి 49 సీసీ, టూ స్ట్రోక్ ఇంజెన్ అమర్చారు. వీటి వేగం గంటకు 45 కిలోమీర్ల నుంచి 72 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. వీటి బరువు మాత్రం 89కేజీల్లోపే. బంపర్‌ను పట్టుకుని తేలిగ్గా ఎటు కావాలంటే అటు కారును ఈడ్చుకుపోవచ్చు. పార్క్ చేసుకోవచ్చు. వీటి ధర రూ.5లక్షలకుపైనే.

పీ50
పొడవు 4 అడుగుల ఐదు అంగుళాలు.
వెడల్పు 3 అడుగుల 4 అంగుళాలు.
ఎత్తు 3 అడుగుల తొమ్మిది అంగుళాలు.
ట్రెడెంట్
ఐదడుగుల పది అంగుళాల పొడవు.
వెడల్పు 3 అడుగుల ఐదు అంగుళాలు
ఎత్తు 4 అడుగుల రెండంగుళాలు.

No comments:

Post a Comment