Pages

Monday

సెల్ వాడితే యుద్ధ నేరగాళ్లే! అరబ్ విప్లవం దెబ్బతో ఉత్తరకొరియా ముందు జాగ్రత్త్ర



ఇక నుంచి సెల్‌ఫోన్ వాడితే జైల్లో పెట్టేస్తారు.. కంగారు పడకండి! మన దేశంలో కాదు. ఉత్తర కొరియాలో.. ఎందుకంటారా? 'అరబ్ వసంతం' ఎక్కడ ఆవహిస్తుందేమోనన్న భయం. దశాబ్దాలుగా సాగుతున్న నిరంకుశ, నియంతృత్వ ప్రభుత్వాలను ఈజిప్ట్, లిబియా, ట్యూనిషియా దేశాల ప్రజలు నేల కూల్చేశారు. ఆ ప్రభావం తమ మీద కూడా పడుతుందేమోనన్నది ఉత్తరకొరియా ప్రభుత్వ భయం. అందులోనూ ఆ దేశంలో అధికార మార్పిడి జరుగబోతోంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కిమ్‌జోంగ్-2 మరణంతో ఆయన వారసుడు కిమ్‌జోంగ్ ఉన్ పాలనా పగ్గాలు చేపడుతున్నారు. 

అంతేగాక.. ఉత్తర కొరియాల్లో ఇటీవల ఆహారోత్పత్తి తగ్గిపోయింది. పెద్ద సంఖ్యలో ప్రజలు పొట్ట చేతబట్టుకొని చైనాకు వలసవెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ విధానాలపై అయిష్టతతో ఉన్నవారికి దేశం వెలుపలి నుంచి ఎలాంటి సహాయం, సమాచారం అందకుండా నిరోధించేందుకు ఉత్తరకొరియా ప్రభుత్వం సెల్‌ఫోన్ల వినియోగాన్ని నిషేధించింది. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఎవరైనా పట్టుబడితే.. వారిని 'యుద్ధ నేరస్థులు'గా పేర్కొని, అందుకు తగ్గ శిక్షలను విధిస్తామని హెచ్చరిస్తోంది.

No comments:

Post a Comment