Pages

Friday

నేనే నెంబర్ వన్


నేనే నెంబర్ వన్.. ఇక నేనే నెంబర్ వన్.. అంటూ ఒబామా హాయిగా పాట పాడుకుంటూ.. గంతులేస్తూ ఉండిపోయాడేమో! ఎందుకంటారా.. అమెరికాలో చేసిన ఓ సర్వేలో అధ్యక్షుడు ఒబామా.. పాలక డెమోక్రటిక్ పార్టీలపై ప్రజలు ఎక్కువ విశ్వాసాన్ని వ్యక్తం చేశారట. అందులోనూ 2012లో అక్కడ ఎన్నికలు జరుగనున్నాయి మరి. అఫ్ఘానిస్థాన్, ఇరాక్ యుద్ధాల్లో చావు తప్పి కన్నులొట్టబోయిన సమయంలో అమెరికా పగ్గాలు చేపట్టిన ఒబామా మొదట్లో చాలానే కష్టపడ్డా.. ర్యాంకింగ్ దిగజారుతూ వచ్చింది. మళ్లీ గెలవడం అసాధ్యమంటూ నివేదికలు కూడా వెలువడ్డాయి. కానీ, ఆ మధ్య లాడెన్‌ను మట్టుబెట్టడం.. ఇటీవల గడాఫీని హతమార్చడంతో ఒబామా ప్రతిష్ఠకు మళ్లీ ప్రాణం వచ్చింది.

No comments:

Post a Comment