అతి చిన్న వయస్సులోనే.. అతిపెద్ద బాధ్యతలు. ఉత్తర కొరియాను 'అణు' స్థాయిలో పటిష్ఠం చేసిన కిమ్‌జోంగ్-2 మూడో కుమారుడు జోంగ్ ఉన్ను 'సుప్రీం లీడర్'గా ప్రభుత్వం గురువారం ప్రకటించింది. " గ్రేట్ కామ్రేడ్ కిమ్‌జోంగ్ వ్యక్తిత్వం, ఆలోచనలను అమలు చేయనున్న కామ్రెడ్ జోంగ్ ఉన్ మా పార్టీకి, మిలటరీకి నాయకుడు'' అని ఆ దేశ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ అధ్యక్షుడు కిమ్ యోంగ్నామ్ పేర్కొన్నారు. తండ్రి అకాల మరణంతో మూడు పదుల వయస్సు కూడా పూర్తికాకుండానే .. జోంగ్ ఉన్ దేశ పాలనా పగ్గాలను చేపడుతున్నారు.
No comments:
Post a Comment