Pages

Tuesday

దుబాయ్‌లో జైలు పాలైన ప్రవాస భారతీయుడు...


భారత్‌కు చెందిన మహమూద్ దుబాయ్‌లో సేల్స్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. క్యాండీ బాబిగ్ అనే ఫిలిపినో అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. రేపో మాపో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు.. కానీ ఇంతలో ఆపద క్రెడిట్ కార్డు రూపంలో వచ్చింది. క్రెడిట్ కార్డుల బిల్లు రోజురోజుకు పెరిగి వాటిని చెల్లించకపోడంతో మహమూద్ కటకటాలపాలయ్యాడు. 2009లో తీవ్ర ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటున్న రోజులు. అప్పడు అతనికి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఉన్న ఉద్యోగం పోయింది.. ఆర్నెళ్ల వరకు పని పాటా లేకుండా తిరిగాడు. దొరికిన దగ్గరల్లా అప్పు చేశాడు. చివరికి నెలకు 4 వేల దీనార్ల(రూ. 55 వేలు) కు ఉద్యోగంలో చేరాడు.

ఇంతలో క్రెడిట్ కార్డు కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆయన పాస్‌పోర్టును క్యాండీ కోర్టులో అప్పగించింది. అంతేగాక తాను కంపెనీ నుంచి పారిపోయినట్టుగా యజమాని మహబూబ్‌పై కేసు కూడా నమోదు చేశాడు. అయితే తన నగలు, మొబైల్ ఫోన్, ఇతర వస్తువులు అమ్మి క్యాండీ డబ్బు తెచ్చినప్పటికీ ఆ యజమాని కేసు వెనక్కి తీసుకునేందుకు ఒప్పుకోలేదు. కేసు వెనక్కి తీసుకోవాలంటే యజమాని 22 వేల దీనార్లు చెల్లించాలన్నాడు. ప్రస్తుతం ఆ డబ్బు తెచ్చే ప్రయత్నంలో ఉంది పాపం క్యాండీ.... ఇక్కడ తన కాబోయే భార్య కచ్చితంగా బెయిల్ ఇస్తుందని మహమూద్ ఆశతో ఉన్నాడు. మహమూద్ బయటికొస్తాడని, ఉద్యోగం చేసి తనను పెళ్లి చేసుకుంటాడని పాపం క్యాండీ కూడా గంపెడాశతో ఎదురుచూస్తోంది.

No comments:

Post a Comment