Pages

Tuesday

పాలిచ్చే తల్లులకు బీపీ దూరం...


ప్రసవం తర్వాత కనీసం ఆరు నెలలపాటు బిడ్డకు పాలిచ్చే తల్లులకు అధిక రక్తపోటు (బీపీ) ముప్పు నాలుగో వంతు తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది. అసలివ్వకపోయినా, మూడు నెలలు ఇచ్చి ఆపేసినా బీపీ వచ్చే అవకాశం పెరుగుతుందని నార్త్ కరోలినా యూనివర్సిటీ నిపుణుల బృందం తెలిపింది. ఒక బిడ్డ ఉన్న 56వేలమంది మహిళలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

స్తన్యం ఇవ్వడం వల్ల తల్లీబిడ్డలిద్దరికీ మేలు చేకూరుతుందని, మహిళల ఆరోగ్యంలో కచ్చితమైన తేడా గమనించవచ్చని వారు భరోసా ఇస్తున్నారు. పాలిచ్చే తల్లులకు మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె సంబంధ వ్యాధులు సోకే అవకాశం తక్కువని ఇప్పటికే కొన్ని పరిశోధనలు తేల్చాయి.

No comments:

Post a Comment