దేశంలో అక్రమ ప్రవేశాలను నిరోధించేందు కు చైనా ఓ అడుగు ముందుకేయనుంది. వీసా నిబంధనలను కఠినతరం చేయనుంది. ఉద్యోగాల వేటలో భాగంగా తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారికి అడ్టుకట్ట వేసేందుకు చైనా ఇదివరకులా కాకుండా అమెరికా తరహా వీసా నిబంధనలను ప్రవేశపెట్టనుంది. ఇకనుంచి వేలిముద్రలను నిబంధనల్లో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ప్రజా భద్రతా శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ అనుమతించింది.
అంతే గాకుండా విదేశీయులు నివాస యోగ్యతా పత్రాన్ని పొందాలన్నా వేలిముద్రలు తప్పనిసరని నిబంధనల్లో పేర్కొంటోంది. నిబంధనల్లో భాగంగా నివాస వీసా పొందాలనుకునే వారు... జర్నలిస్టులు సహా ప్రతి ఒక్కరూ వైద్యపరీక్షలు చేయించుకోవాలి. గత ఏడాది వరకు రెసిడెన్స్ వీసాల కోసం వచ్చే విదేశీయులందరూ ఎయిడ్స్ పరీక్ష కూడా చేయించుకోవాలనే నిబంధన కూడా అమలు చేసింది. వేలిముద్రలు, ఇతర బయోటెక్నాలజీ సమాచారం ద్వారా ప్రభావవంతమైన ఫలితా లు వస్తాయని ప్రజా భద్రతా శాఖ ఉప మంత్రి యాంగ్ హాన్నింగ్ పేర్కొన్నారు.

No comments:
Post a Comment