Pages

Friday

7 కిలోమీటర్ల లోతుకు వెళ్లనున్న చైనా తొలి జలాంతర్గామి


చైనాకు చెందిన తొలి మానవసహిత జలాంతర్గామి వచ్చే ఏడాది సముద్రంలో 7 కిలోమీటర్ల లోతుకు వెళ్లనుంది. ఇది గత ఏడాది పసిఫిక్ మహాసముద్రంలో 5,188 మీటర్ల లోతుకు వెళ్లి రికార్డు సృష్టించింది. జియావోలాంగ్ పేరు గల ఈ జలాంతర్గామిని తొలిసారిగా చైనా స్వతంత్రంగా రూపొందించింది. ఈ డైవ్‌తో పాటు చైనా సముద్రంలోపల సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరికరాలను, సమగ్ర జలాంతర్గాములు, స్వయంప్రతిపత్తి గల వాహనాలను రూపొందించనుందని అధికారులు తెలిపారు.

2010లో జియావోలాంగ్ విజయవంతంగా దక్షిణ చైనా సముద్రంలో 3,759 మీటర్ల లోతుకు వెళ్లింది. సముద్రంలో 3.5 కిలోమీటర్ల లోతుకు మానవుడిని పంపిన దేశాల్లో చైనా ఐదో స్థానం దక్కించుకుంది. ఈ రికార్డును తొలిసారిగా అమెరికా, తరువాత స్థానాలు ఫ్రాన్స్, రష్యా, జపాన్ సాధించాయి.

No comments:

Post a Comment