Pages

Tuesday

లీటరుకు 35.4 కిలో మీటర్లు...


 మైలేజీలో సరికొత్త సంచలనానికి టొయోటా తెరతీసింది. లీటరు పెట్రోల్‌కు 35.4 కిలో మీటర్ల మైలేజీనిచ్చే 'ఆక్వా' కారును జపాన్ మార్కెట్లోకి ఈ కంపెనీ విడుదల చేసింది. 1.5 లీటర్ హైబ్రిడ్ సిస్టమ్‌తో ఈ కాంపాక్ట్ కారును తయారు చేశారు. ఆక్వా ధరల శ్రేణి మన కరెన్సీలో 11,49,040 రూపాయల నుంచి 12,57,690 రూపాయల వరకు (21,680-23,730 డాలర్లు) ఉంది.

సోమవారం జపాన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ కారును టొయోటా మోటార్ కార్ప్ చీఫ్ ఇంజనీర్ సటోషి ఒగిసో మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కారు అరంగేట్రంతో ఆటో పరిశ్రమలో మైలేజీ విషయంలో సరికొత్త యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

No comments:

Post a Comment