Pages

Sunday

మరో రికార్డు సాధించిన చి(పొ)ట్టి మహిళ


ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సాధించిన భారత యువతి జ్యోతి ఆమ్గే (18).. తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. స్థానిక డెయిలీ మెయిల్ వెల్లడించిన ప్రకారం.. ప్రపంచంలో పొట్టి పురుషుడిగా రికార్డు సొంతం చేసుకున్న నేపాల్ వాసి చంద్ర దాంగి(72)ని ఆమె ఇటీవల ఇటలీలో కలుసుకున్నారు. గిన్నిస్ బుక్ 2013 నూతన ఎడిషన్ కోసం ఈ ఇద్దరూ కలిసి ఫొటోలకు కొద్ది రోజుల క్రితం పోజులిచ్చారు. వీరిద్దరి మధ్యా 54 ఏళ్ల వ్యత్యాసం ఉన్నా అవేమీ పట్టించుకోని జ్యోతి, చంద్రలు తమ దేశాల సంప్రదాయ దుస్తులతో దిగిన ఫొటోలు చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రపంచపు పొట్టి వ్యక్తులుగా రికార్డు సొంతం చేసుకున్న మహిళ, పురుషుడు ఇంతవరకు ఒకేసారి ఏదైనా కార్యక్రమానికి హాజరైన రికార్డు ఇంతవరకు లేదు. కానీ, ఇటలీలో వీరు కలుసుకున్న అనంతరం సదరు రికార్డు నమోదైంది. 

భారత్ లోని నాగపూర్ వాసి అయిన జ్యోతి కేవలం 24.7 ఇంచుల పొడవు మాత్రమే ఉండి ప్రపంచపు పొట్టి మహిళగా రికార్డు సాధించింది. ఆమె వచ్చే సెప్టెంబరులో నిర్వహించనున్న 2013 గిన్నిస్ బుక్ ఎడిషన్ విడుదల కార్యక్రమంలో పాల్గొననుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిన్నిస్ రికార్డు సాధించిననాటి నుంచి తనకు పలు దేశాలు సందర్శించే అవకాశం కలుగుతోందని తెలిపింది. స్వతహాగా ప్రయాణమంటే ఎంతో ఇష్టపడే తాను జపాన్, పలు యూరోపియన్ దేశాలు సందర్శించానని, ఇప్పుడు బ్రిటన్ కూడా వెళ్లనున్నానని పేర్కొంది.

అలాగే, నేపాల్ రాజధాని ఖాట్మండుకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలోని రింకోలా అనే చిన్న పల్లెటూరుకు చెందిన చంద్ర దాంగి మాట్లాడుతూ గిన్నిస్ బుక్ రికార్డుల్లో స్థానంపై హర్షం వ్యక్తం చేశారు. కేవలం 21.5 ఇంచులు మాత్రమే ఉన్న పొడుగుతో ప్రపంచపు అతి పొట్టి పురుషుడిగా పేరు పొందిన దాంగి.. తాజాగా సాధించిన రికార్డుతో తన కుటుంబానికి, పుట్టి పెరిగిన పల్లెటూరికి ప్రపంచవ్యాప్తంగా పేరు వస్తుందని ఆనందంగా చెప్పారు. కాగా, గతంలో భారత యువకుడు 22.5 ఇంచుల పొడవున్న గుల్ మొహమ్మద్ పేరిట నమోదైన రికార్డును దాంగి తుడిచిపెట్టాడు.

No comments:

Post a Comment