ప్రస్తుత కాలంలో చాలా మంది మడిమ నొప్పితో బాధపడుతున్నారు. మారిన జీవన శైలి విధానం వల్ల సరైన పోషకాహారం తీసుకోక ఊబకాయం తోడై మడిమ నొప్పిని అతి చిన్న వయస్సులోనే ఎదుర్కొంటున్నారు. నిత్య జీవితంలో ప్రతి కదలిక మడిమలోని కీలు సహాయంతో జరుగుతుంది. మడిమ ఎముకలో మార్పు రావటం వలన మడిమ నొప్పితో కదలికలు కష్టంగా మారతాయి.
మడిమ నొప్పికి కారణాలు:
మడిమ కింది భాగంలో ఉండే ఎముక (కాల్కేనియస్) పదు నుగా పెరుగుతుంది. ఫలితంగా పాదం అడుగు భాగంలో నొప్పి కలుగుతుంది.
లక్షణాలు:
- ఉదయం నిద్రలేచిన తరువాత మొదట కదిలిక విప రీతమైన నొప్పి ఉంటుంది. కొద్ది దూరం నడిచిన తరువాత నొప్పి తీవ్రత తగ్గుతుంది.
- మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పాదం అడుగు భాగాన నొప్పి ఉంటుంది.
- పరిగెత్తేటప్పుడు నొప్పి తీవ్రత పెరుగుతుంది.
- ఎక్కువ సేపు కింద కూర్చొని పైకి లేచినప్పుడు పాదం అడుగు భాగంలో నొప్పి వచ్చి వేధిస్తుంది.
- మడిమ భాగం వాపుతో కూడి ఉండి నొప్పిగా ఉంటుంది. కాలి మడిమకు కింది భాగాన అనుకోకుండా ఎదైనా ఒత్తిన ట్లైయితే నొప్పి భరించలేకుండా ఉంటుంది. జాగ్రత్తలు:
- మడిమ నొప్పికి నాటు వైద్యం, పచ్చబొట్లు లాంటివి చేయిం చరాదు.
- నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పాదంను వేడి నీళ్లలో ఉంచి అడుగు భాగంను నెమ్మదిగా ప్రెస్ చేయాలి.
- కాలి పాదంను కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి తిప్పుతూ నెమ్మదిగా వ్యాయామం చేయాలి.
- వ్యాయామాలు చేసేటప్పుడు ఫిజియోథెరపీ వైద్యుల సలహాలు తీసుకోవాలి.
- నొప్పి ఉన్నప్పుడు అతిగా ‘పెయిన్ కిల్లర్స్’ వాడకుండా డాక్ట ర్ సలహా మేరకు హోమియో మందులను వాడుకోవాలి.
- అధిక బరువు ఉన్న వారు బరువు తగ్గటానికి ప్రయత్నిం చాలి.
- నొప్పి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు బరువులు ఎత్తటం, పరిగెత్తటం, మెల్లు ఎక్కటం, మెట్లు దిగటం చేయకూడదు. పరీక్షలు: ఎక్స్‌రే వలన మడిమ నొప్పి తీవ్రతను తెలుపుతాయి. చికిత్స: మడిమ నొప్పి లక్షణాలను, వ్యక్తిత్వ లక్షణాలు పరిగణలోకి తీసుకొని హోమియో మందులను ఎన్నుకొని చికిత్స చేయడం వలన మడిమ శూల నుండి ఉపశమనం పొందవచ్చు. మందులు: లెడంపాల్: వీరికి కాలి పాదాలలో నొప్పి ఎక్కువగా వాపుతో కూడి ఉంటుంది. వీరు వేడి కాపును భరించలేరు. చల్లని నీళ్లు కాళ్లకు తాకిన మడిమ నొప్పి నుండి ఉపశమనం పొందే వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది. బ్రయోనియా: వీరికి కదలికల వల్ల పాదం అడుగు భాగాన నొప్పి ఎక్కువ అవుతుంది. విశ్రాంతి వల్ల తగ్గుట గమనించ దగిన లక్షణం. వీరికి దాహం ఎక్కువగా ఉంటుంది. అయినప్ప టికీ మలబద్ధకంతో బాధపడుతుంటారు. మలం గట్టి వస్తుంది. మానసిక స్థాయిలో వీరు ఇంటిపైనే ఎక్కువగా బెంగపెట్టుకొని ఉంటారు. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు వాడుకో దగినది. ఆర్నికా: పడటం వలన పాదం అడుగు ప్రాంతంలో కముకు దెబ్బలు తగలటం, బెణకటం వలన నొప్పి ఉంటే ఈ మందు వాడుకోదగినది. అలాగే శారీరక శ్రమ అనంతరం పాదం నొప్పి వేధిస్తుంటే ఈ మందు వాడుకొని ప్రయోజనం పొంద వచ్చు. కాల్కేరియా కార్బ్: పాదం అడుగు భాగంలో ఎముక (కాల్కే నియస్) పెరుగుదల వలన నొప్పి వచ్చే వారికి ఈ మందు బాగా పని చేస్తుంది. వీరు చూడటానికి లావుగా ఉంటారు. వీరి పొట్ట ముందుకు పొడుచుకొని వచ్చి బోర్లించిన మూకుడు లాగా ఉంటుంది. తల పెద్దదిగా ఉంటుంది. వీరికి తల మీద చెమటలు ఎక్కువగా వస్తుండటం గమనించదగిన లక్షణం. వీరు మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. ఇటువంటి శారీరక, మానసిక లక్షణాలున్న వారికి మడిమ నొప్పి తగ్గించటానికి ‘కాన్షిట్యూషనల్’ మందుగా కాల్కేరియా కార్బ్ బాగా ఉపయోగపడుతుంది.ఈ మందులే కాకుండా రస్టాక్స్, రూటా, సల్ఫర్, కాలికార్బ్, కోలోసింత్, మాగ్‌ఫాస్, సింఫైటినం, సైక్లోమిన్, కాల్కేరియా ఫ్లోర్, కాలీమోర్ వంటి మందులను లక్షణ సముదాయంను పరిగణలోకి తీసుకొని వైద్యం చేసిన యెడల నొప్పి నుండి విముక్తి పొందవచ్చు
No comments:
Post a Comment