కరకు హృదయాలను కూడా కరిగించే ఈ ఉదంతం విజయనగరంలో వెలుగుచూసింది. పట్టణంలో వ్యభిచారం జోరుగా సాగుతోందన్న సమాచారం నేపథ్యంలో 'ఆన్‌లైన్ ప్రతినిధి' బుధవారం రాత్రి నిఘా వేయగా, నడివీధిలో.. తోపుడు బండిపై తన ఇద్దరు పిల్లలకు అన్నం తినిపిస్తూ కనిపించిం దో మహిళ. చింపిరి జుత్తు, నలిగిన దేహంతో ఉన్న ఆమె గురించి అక్కడే ఉన్న రిక్షాపుల్లర్‌ను ఆరా తీయగా.. ఆమె దయనీయగాథ గురించి తెలిపాడు. అతను చెప్పినదాని ప్రకారం.. బెంగాల్‌కు చెందిన ఆ మహిళ, కొద్దిరోజుల కిందట తన ఇద్దరు పిల్లలతో విజయనగరం రైల్వే స్టేషన్‌లో దిగింది. ఊరుగానిఊరు.. భాష తెలీదు! బంధువులు లేరు! నిలువ నీడ లేదు!! దీంతో రైల్వే స్టేషనే వారికి ఆవాసమైంది.
ఈ క్రమంలో ఆమెకు ఒక హిజ్రాతో పరిచయమైంది. ఆమె గతమేమిటో తెలియదుగానీ.. హిజ్రాతో పరిచయమైననాటి నుంచి ఆమె పడుపువృత్తితో జీవిస్తోంది! ఆ డబ్బుతోనే పిల్లల ఆకలి తీరుస్తోంది. అయితే, రైల్వేస్టేషన్ వద్ద రాత్రుళ్లు పోలీసుల వేధింపులు ఎక్కువగా ఉండటంతో తన పిల్లలను తీసుకొని వేరేచోటకు మారి అక్కడే తలదాచుకుంటోంది. రోడ్డుపై తమ వ్యాపారాలు ముగించుకొన్న హాకర్లు వదిలివెళ్లిన తోపుడు బండ్లపై తన ఇద్దరు పిల్లలను నిద్రపుచ్చి ఆమె విటులతో వెళ్తుంది. వారిచ్చే సొమ్ముతో ఏ అర్ధరాత్రికో భోజనం పార్శిల్ తెచ్చి పిల్లలను నిద్రలేపి వారికి కడుపు నిండా తినిపిస్తుంది. తాను పిల్లలతో ఉన్నప్పుడు ఎవరైనా విటులు వచ్చి రమ్మంటే వారిని తన భాషలో కసిరిపారేస్తుంది.
పునరావాసం ఎక్కడ?
జిల్లాలో వ్యభిచారాన్ని నియంత్రించడానికి పోలీసు యంత్రాంగం, ఆ రొంపిలో ఉన్న వారిని విడిపించి వారికి పునరావాసం కల్పిస్తామంటూ ప్రభుత్వం నుంచి రూ.కోట్లు నిధులు పొందుతున్న స్వచ్ఛంద సంస్థలు చాలానే ఉన్నాయి. కానీ ఈ రెండు వ్యవస్థలూ తమ విధుల్లో పూర్తిగా విఫలమయ్యాయనడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో వ్యభిచారాన్ని నియంత్రించలేకపోతోంది. అడపాదడపా దాడులు చేస్తున్నా.. వారు విటులను పట్టుకున్న సందర్భాలకన్నా.. ఆ వృత్తిలోని మహిళలపై చేస్తున్న జులుమే ఎక్కువ.
ఆ మహిళలను స్టేషన్‌కి తీసుకువెళ్లడం.. పైపైన కౌన్సెలింగ్ ఇచ్చి జరిమానా విధించి పంపేయడం ఆనవాయితీగా మారుతోంది. ఇక స్వచ్ఛంద సంస్థల విషయానికి వస్తే.. సెక్స్‌వర్కర్లకు పునరావాసం పేరిట పలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం నుంచి నిధులు సమకూర్చుకుంటున్నాయి. కానీ ఇంతవరకూ ఎంతమందికి పునరావాసం కల్పించారంటే చెప్పడానికి ఏ స్వచ్ఛంద సంస్థా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. చాలా పట్టణ ప్రాంతాల్లో బాలికలు కూడా ఈ రొంపిలో కూరుకుపోయి తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు.

No comments:
Post a Comment