Pages

Sunday

వెండితెరపై విలక్షణ ముద్ర .... పవన్..!


 తెలుగు చిత్ర సీమకి చిరంజీవి తమ్ముడిగా కొణిదల కల్యాణ్ బాబు  'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి' చిత్రంతో పరిచయం అయ్యాడు.  తన పేరులో 'పవన్' పదాన్ని చేర్చుకుని, వాయువేగంతో రెండవ చిత్రానికే 'గోకులంలో సీత' అంటూ తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించుకున్నాడు. 'సుస్వాగతం', 'తొలిప్రేమ' వంటి వినూత్న ప్రేమ కథలను ఎంచుకోవడంతో వరుస విజయాలను అందుకుని, 'యూత్' కి అభిమాన పాత్రుడైపోయాడు. ఆ తరువాత ఇక తను వెనుతిరిగి చూసుకోలేదు. మూస సినిమాలకు మంగళం పాడాడు. కుర్రాళ్ళు కోరుకునే యూత్ సబ్జెక్ట్ తో  'తమ్ముడు', 'బద్రి' లాంటి సినిమాలు చేసి, ప్రతి ప్రేక్షకుడు తన సినిమా కోసం ఎదురు చూసేలా చేసాడు.
      తన నటనలో, ఫైట్స్ లో, డైలాగ్ చెప్పటంలో.. ఇలా ఒకటేమిటి ప్రతి అంశంలో పవన్ కల్యాణ్ తన బ్రాండుకొత్తదనాన్ని ఆవిష్కరించాడు. ఆ తరువాత వచ్చిన 'ఖుషి' సినిమా యువతని మాయ చేసేసి, పవన్ మేనియాలోకి నెట్టేసింది. కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా,  సమాజంపై తనకున్న బాధ్యత తెలియజేస్తూ, తన ప్రతి సినిమాలో సామాజిక దృక్పథంతో కూడిన ఒక గీతాన్ని ఉండేలా చూసుకున్నాడు.
      అయితే, వరుస విజయాలతో దూసుకుపోయిన పవన్ కు కూడా ఒకసారి బ్రేక్ పడింది. కొన్ని సినిమాలు ఆశించిన మేర ప్రేక్షకులను అలరించలేకపోయాయి. దాంతో, తన నుండి అభిమానులు ఏం ఆశిస్తున్నారో అవి ఉండేలా 'జల్సా' చేశాడు. అది భారీ విజయాన్నిచ్చింది. తర్వాత కథ మళ్లీ మామూలే!  'పులి', 'తీన్ మార్', 'పంజా' చిత్రాలు నిరాశ పరిచాయి. అంతే... ఆ తర్వాత మళ్లీ గాడిలో పడ్డాడు. 'గబ్బర్ సింగ్' తో బాక్సాఫీస్ రికార్డులు తిరగ రాసి, తన పూర్వ వైభవం సంపాదించుకున్నాడు.
     ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందించాలని తపన పడే పవన్, ఇప్పుడు సంత్సరానికి రెండు, మూడు సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. పూరి కాంబినేషన్ లో వస్తున్న 'కెమెరామాన్ గంగతో రాంబాబు' చిత్రంతో మళ్లీ ప్రేక్షకులను అలరిస్తాడని ఆశిస్తూ, ఈ రోజు ఆయన 
బర్త్ డే సందర్భంగా పవన్ కల్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు.

No comments:

Post a Comment