Pages

Wednesday

సేవకు చిహ్నం - ఉపాధి పుష్కలం ( NURSING )


నర్సింగ్ అరుదైన వృత్తి. సహనం, సేవాభావం ఉన్నవారు రంగాన్ని తమ కెరీర్ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. ఎంతమంది స్పెషలిస్టులు వైద్య సేవలందించినా, నర్సుల సేవలు లేనిదే అవి సత్ఫలితాలను ఇవ్వవు. నిరంతరాయంగా పనిచేస్తూ రోగికి కావాల్సిన అన్నీ సమకూర్చి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడంలో నర్సుల పాత్ర అమోఘం. వైద్య రంగంలో వైద్యులు దైవ సమానులైతే, నర్సులను తల్లి సమానులుగా మనం భావించవచ్చు. స్వయానా మన బంధువులు సైతం చేయని పనులను నర్సులు అసహ్యపడకుండా చేస్తూ ఉంటారు. ప్రపంచీకరణ, పట్టణీకరణ నేపథ్యంలో పెరుగుతున్న కాలుష్యం ఫలితంగా పెరుగుతున్న వ్యాధులు, దీర్ఘకాలంగా వదలని మొండి వ్యాధులు, రోజుకోరోజు కొత్తగా పుట్టుకొస్తున్న వ్యాధుల నేపథ్యంలో ప్రపంచం మొత్తంమీద ఆసుపత్రుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆసుపత్రులలో అతి కీలక పాత్ర వైద్యులు పోషిస్తుంటే పరోక్షంగా రోగికి స్వస్థత చేకూర్చే పనిలో నర్సులు తల మునకలవుతుంటారు. నర్సింగ్‌ కోర్సులు చదివిన వారికోసం దేశ, విదేశాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు, ఉపాధి మార్గాలు ఎదురుచూస్తున్నాయి. అందుకే ప్రస్తుతం చాలామంది దీనివైపు మొగ్గుచూపుతున్నారు. బిఎస్సీ నర్సింగ్‌, ఎమ్మెస్సీ నర్సింగ్‌, జిఎన్‌ఎం ఎఎన్‌ఎం తదితర కోర్సులు అందించేందుకు వేలకొలది ఇన్‌స్టిట్యూట్‌లు ముందుకొస్తున్నాయి. దేశంలోని ముఖ్యమైన 500 నర్సింగ్‌ కళాశాలలు ప్రతి ఏడాదీ సుమారు 10,000 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తున్నాయి. నైపుణ్యం కలిగిన నర్సులుగా తీర్చిదిద్దుతున్నాయి. కొన్ని ప్రయివేటు సంస్థలు కూడా నర్సింగ్‌ కోర్సుల్ని అందిస్తున్నాయి. 'స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ కూడా ఎంతో మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది'. రోజురోజుకీ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రంగంపై కెరీర్‌ను మలచుకునే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. అయితే రంగాన్ని తమ కెరీర్‌గా ఎంచుకునే వారు కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండాలి.

కెరీర్లోకి ఎలా ప్రవేశించాలి...?
నర్సింగ్‌ కోర్సు చదివిన వారు తమ కెరీర్ని ప్రారంభించవచ్చు. బిఎస్సీ నర్సింగ్‌, జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ(జిఎన్‌ఎం), ఎమ్మెస్సీ నర్సింగ్‌ ఆగ్జిలరీ నర్స్‌ మిడ్‌వైఫెర్‌/హెల్త్‌ వర్కర్‌ (ఎఎన్‌ఎం) కోర్సులు చదివిన వారికి మంచి అవకాశాలుంటాయి. బిఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశించేవారికి 10+2 బై.పి.సి అర్హత కలిగుండాలి. కోర్సు వ్యవధి నాలుగేళ్లు ఉంటుంది. బిఎస్సీ నర్సింగ్‌ పూర్తయిన వారు ఎమ్మెస్సీ నర్సింగ్‌ చేయొచ్చు. కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. ఇక జిఎన్‌ఎం చేయాలనుకున్న వారు 10+2 బై.పి.సి అయ్యుండాలి. కోర్సు కాలవ్యవధి 3.5 సంవత్సరాలు. ఎఎన్‌ఎంగా రాణించాలనుకునే వారు పదోతరగతి పాసై ఉంటేచాలు. 18 నెలల ట్రెయినింగ్‌ తర్వాత ఎఎన్‌ఎంగా కెరీర్‌ ప్రారంభించవచ్చు.

అనేక రకాలుగా...
అందరిదీ సేవ దృక్పథమే అయినా నర్సు వృత్తిలో అనేక రకాలుంటాయి.
అవి :-
1. క్లినికల్‌ ప్రాక్టీషనర్స్‌
2. అడ్మినిస్ట్రేషన్‌
3. టీచింగ్‌
4. రీసెర్చ్‌ లాంటి విభాగాలుంటాయి.
ఏయే విభాగాల్లోని వారు ఆయా బాధ్యతల్ని నిర్వహిస్తుంటారు. వయసు వారికైనా, ఎలాంటి రోగులకైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సేవలందించేందుకు అన్ని విభాగాలూ సేవాదృక్పథంతోనే పనిచేస్తుంటాయి. విభాగంలో పనిచేసినా నర్సు వృత్తికి ఉన్న గౌరవమూ, గుర్తింపూ ఒక్కటే. విశేష ఆదరణ చూరగొంటున్న తీరూ ఒక్కటే.

ప్రత్యేక లక్షణాలు అవసరం :
v నర్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకునే వారికి ఓర్పు, సహనం అవసరం. రోజుకి పదినుంచి 12 గంటలు రోగుల మధ్య పని చేయాల్సి ఉంటుంది. రోగులకు వేళకు మందులు ఇవ్వడం, వారడిగిన ప్రతి ప్రశ్నకు ఓర్పుతో సమాధానం చెప్పడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రోగులపట్ల చిరాకు పడకుండా సహనంతో ఓర్పుతో పని చేయాల్సి ఉంటుంది.

o   ఇతర ఉద్యోగాల వలే కాకుండా నర్సింగ్ రంగంలో పనివేళలు భిన్నంగా ఉంటాయి. ఎక్కువ సార్లు నైట్‌డ్యూటీలు చేయాల్సి రావచ్చు. కనక నైట్ షిప్టులలో కూడా పని చేయగలిగే నేర్పును సంపాదించుకోవాలి.

o   రంగంలో అడుగుపెట్టాలనుకునేవారికి సేవా భావం తప్పనిసరి. ఏదో ఇతర వృత్తులకు వలే వృత్తిని ఎంచుకుంటే అలాంటివారు నిరాశకు గురికాక తప్పదు. ఇతరులకు సేవ చేయాలనుకునేవారు, పైసా ఆశించకుండా ఇతరులకు సహాయం చేయాలనుకునేవారే రంగంలో రాణించగలుగుతారు.

o   నర్సింగ్ రంగం భిన్నమైనది. నిరంతరం సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులుంటాయి. అందువల్ల సవాళ్లను ఎదుర్కొనే గుండె ధైర్యం రంగాన్ని ఎంచుకునే అభ్యర్థులకు ఉండాలి.

o   రంగంలో రాణించాలనుకునేవారికి చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. భిన్న రకాలైన వ్యక్తులు, మనస్తత్వాలు గల మనుషులతో కలిసి పని చేయాల్సి రావడంవల్ల మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం.

o   ఎంత పని వత్తిడులున్నా తాము చూడాల్సిన రోగుల స్థితిగతులు, వారి ఆరోగ్య పరిస్థితులు నర్సులు ఎప్పటికప్పుడు తెలుసుకునే నేర్పు కలిగి ఉండాలి. ఒక్కోసారి రోగులకు అర్ధంతరంగా వ్యాధి తిరగబెట్టే సమయంలో కంగారు పడకుండా నేర్పుతో వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే పనిని నర్సులు చేపట్టాలి. డాక్టర్ వచ్చే లోపు ప్రాథమిక చికిత్స ఏదైనా చేయగలిగి ఆయా రోగులకు మనోధైర్యాన్ని పెంచగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి.

విదేశాల్లోనూ అవకాశాలు :
నర్సింగ్ కోర్సులు చేసిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో వారికి అవకాశాలుంటాయి. నర్సింగ్‌హోంలు, వృద్ధాశ్రమాలు, పరిశ్రమల్లోని క్లినిక్‌లు, రైల్వేలు వాటి ఆరోగ్య విభాగాలలో ఉద్యోగావకాశాలున్నాయి. నర్సింగ్ కోర్సులు చేసిన వారికి విదేశాలలో కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. వివిధ దేశాలలో నర్సు వృత్తి చేపట్టాలంటే అక్కడ నిర్వహించే అర్హత పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. ప్రస్తుతం అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్, సింగపూర్ లాంటి దేశాల్లో అవకాశాలు అనేకం ఉన్నాయి. ఆయా దేశాలన్నీ మన దేశంలో ఉన్న నర్సులకు అధిక మొత్తంలో వేతనాలతో ఉద్యోగావకాశాలు అందిస్తున్నాయి. అయితే విదేశాల్లో ఉపాధి అవకాశాలకోసం ప్రయత్నించే వారు అక్కడ నిర్వహించే ప్రవేశ పరీక్షకు విధిగా హాజరు కావాలి. అమెరికాలో నర్సుగా స్థిరపడాలనుకునేవారు కమిషన్ ఆన్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఫారిన్ స్కూల్స్ నిర్వహించే నేషనల్ కౌన్సిల్ లైసెన్సర్ ఎగ్జామినేషన్ ఫర్ రిజిస్టర్డ్ నర్సెస్‌లో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే కెనడాలో నర్సుగా ఉపాధి సంపాదించాలంటే కెనడియన్ రిజిస్టర్డ్ నర్స్ ఎగ్జామినేషన్‌లో పాసవ్వాలి.

మరికొన్ని దేశాలలో కూడా అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయి. మన దేశంనుంచి ఏటా సుమారు 30వేల మంది నర్సులు ఇతర దేశాలకు వెళుతున్నారంటే రంగానికి ఎంత డిమాండ్ ఉందో అవగతం చేసుకోవచ్చు. అయితే విదేశాలలో నర్సింగ్ వృత్తిలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు నర్సింగ్‌లో మంచి పరిజ్ఞానంతోపాటు ఇంగ్లీషు భాషపైమంచి పట్టు ఉండాలి. ముఖ్యంగా ఇంగ్లీషులో రాయడం, చదవడంతోపాటు మాట్లాడడం చేసేవారికి విదేశాల్లో మంచి ఉపాధి అవకాశాలకు లోటుండదు.

వేతనాలెలా ఉంటాయి...?
సాధారణంగా ప్రభుత్వ రంగంలో నర్సుగా వృత్తి బాధ్యతలు చేపట్టేవారికి ప్రారంభ వేతనం సుమారు 15 వేల వరకూ ఉంటుంది. సీనియారిటీ ప్రకారం పదోన్నతులు ఉంటాయి. సీనియారిటీ ఉన్న వారికి సుమారు 50 వేల వరకూ సంపాదించే వీలుంది. అయితే ప్రైవేటు ఆసుపత్రులు మాత్రం ఆయా ఆసుపత్రుల డిమాండ్‌ను బట్టి జీతభత్యాలనిస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులలో ప్రారంభ వేతనం 7వేల రూపాయలు ఉంటుంది. సీనియారిటీ ప్రకారం అక్కడ కూడా పదోన్నతులు, అధిక మొత్తంలో జీత భత్యాలుంటాయి.
ఇతర రంగాలకు వలే నర్సింగ్ రంగంలో కూడా అనేక రకాలైన కోర్సులున్నాయి. అర్హత, అభిరుచులననుసరించి అభ్యర్థులు ఆయా కోర్సులు చదువుకోవచ్చు.

బీఎస్సీ నర్సింగ్
ప్రస్తుతం కోర్సుకు విపరీతమైన డిమాండ్ ఉంది. మన రాష్ట్రంలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతోపాటు అనేక విద్యా సంస్థలు బీఎస్సీ నర్సింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. కోర్సులో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు బైపీసీతో ఇంటర్ పాసవ్వాలి. కోర్సు చేయడానికి ఎలాంటి ప్రవేశ పరీక్ష లేదు. అయితే అకడమిక్ రికార్డుననుసరించి అభ్యర్థులకు కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు సంబంధించి రాష్టవ్య్రాప్తంగా పదివేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి.

జనరల్ మిడ్ వైఫరీ
మూడున్నరేళ్ల కాల వ్యవధికల కోర్సు చేయడానికి అభ్యర్థులు బైపీసీతో ఇంటర్ పాసవ్వాలి. బీఎస్సీ నర్సింగ్‌తో సమానంగా పరిగణించే కోర్సు ప్రవేశాల్లో ఎఎన్‌ఎంగా పని చేసిన వారికి ఏడాది సడలింపు ఇస్తారు.

యాక్జిలరీ మిడ్‌వైఫ్ కోర్సు
ఏడాదిన్నర కాల వ్యవధి కల కోర్సు చేయాలనుకునే అభ్యర్థులు పదవ తరగతి పాసై ఉండాలి. కోర్సు పూర్తి చేసిన వారు ఏదైనా ఆసపత్రులలో నర్సుగా చేరవచ్చు.

మిలటరీ నర్సింగ్ సర్వీస్
మిలటరీ హాస్పిటల్స్‌లల్లో ఉద్యోగాల కోసం కొన్ని ఆర్మీ ఫోర్సెస్‌ సంస్థలు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి. 10+2 బై.పి.సి అర్హత గలవారికి మూడేళ్ల కాలవ్యవధిగల బిఎస్సీ నర్సింగ్‌ కోర్సులూ, ప్రొబెషనరీ నర్సింగ్‌ కోర్సులూ అందిస్తున్నాయి. సందర్భంగా జీతమూ, అలవెన్సులూ ఇస్తారుమిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌ (ఎంఎన్‌ఎస్‌) కూడా ఐదేళ్ల కోర్సునూ, నాలుగేళ్ల కోర్సునూ ఉచితంగానే అందిస్తోంది. సందర్భంగా అలవెన్సులూ, యూనిఫామ్‌, జీతభత్యాలూ ఇస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు, 10+2 బై.పి.సిలో 45 శాతం మార్కులు కలిగి ఉన్నవారు అందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 17-24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులైతే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

ఉద్యోగావకాశాలు...
నర్సింగ్‌ కోర్సులు చదివిన వారికి ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో, హాస్పిటల్స్‌ల్లో ఉద్యోగాలు లభిస్తాయి. బోధనా రంగంలో, రీసెర్చ్‌ విభాగంలో, అడ్మినిస్ట్రేషన్లో, ట్రైనీ సెంటర్లల్లో, ఇన్‌స్టిట్యూట్లల్లో, ఆర్మీఫోర్స్‌లో, రైల్వేరంగంలో బోల్డన్ని అవకాశాలుంటాయి. సొంతంగా కూడా ఇన్‌స్టిట్యూట్లూ, ప్రాక్టీస్‌ సెంటర్లూ ప్రారంభించవచ్చు. కావలసిందల్లా వృత్తినైపుణ్యం అలవర్చుకోవమూ, అర్హత సంపాదించడమే. అందుకోసం ప్రొఫెషనల్‌ ట్యాలెంట్‌కోసం ఉపయోగపడుతుందన్న ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. రోజురోజుకూ మారుతున్న పరిస్థితులను, వైద్యరంగంలో వస్తున్న మార్పులనూ గమనిస్తుండాలి. పరిశోధన్మాతకత దృష్టినీ ప్రదర్శించగలగాలి. బిఎస్సీ, ఎమ్మెస్సీ నర్సింగ్‌ కోర్సులు చదివిన వారికి ప్రభుత్వ, ప్రయివేటుసంస్థల్లో, హాస్పిటల్స్‌ల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, డిస్పెన్సరీల్లో ఆరోగ్య పథకాలల్లో, ప్రాజెక్టులల్లో ఎప్పుడూ అవకాశాలు ఉంటూనే ఉంటాయి. కొన్ని కార్పొరేట్‌ హాస్పిటల్స్‌, రైల్వే హాస్పిటల్స్‌ నర్సులకు ఆకర్షణీయమైన వేతనాలు చెల్లిస్తున్నాయి. నర్సింగ్‌ చదివిన వారు ఆయా ఆస్పత్రుల్లో తాత్కాలికంగా కూడా పనిచేస్తూ రోజువారి వేతనం పొందుతున్నారు. మిడ్‌వైఫెర్‌ నర్సులకు ప్రారంభవేతనం నెలకు 6,000 వరకు ఫిక్స్‌డ్‌ శాలరీయేగాక వివిధ అలవెన్సులు కూడా ఉంటాయి. హెల్త్‌ వర్కర్లు నెలకు 2000-4000 వరకు ఉంటుంది. ప్రభుత్వ రంగంలోని డిఫెన్స్‌, రైల్వే విభాగాల్లో అయితే ఎక్కువ మొత్తంలో జీతభత్యాలుంటాయి. వీటితోపాటు అలవెన్సులూ, పిఎఫ్‌లూ, ఇఎస్‌ఐలూ, అదనపు సౌకర్యాలూ ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నర్సింగ్‌ కాలేజిలు...
1.ఆంధ్ర మహిళా సభ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, యూనివర్సిటీ రోడ్‌, విద్యానగర్‌, హైదరాబాద్‌-500044
2.అపర్ణ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, హౌస్‌ నెం.15/76, న్యూ జెరూసలెం ప్రేయర్‌ హాల్‌ ఎదురుగా, పద్మావతి నగర్‌, తిరుపతి 517 502
3.అపోలో హాస్పిటల్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌
4.అర్చనా స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, 81- అమలాస్‌ కాలనీ, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌-500 036
5.సిఎంసి హాస్పిటల్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, పిఠాపురం
6. గాంధీ హాస్పిటల్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, సికింద్రాబాద్‌
7.జియోఫార్డ్‌ మెమోరియల్‌ హాస్పిటల్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, నూజివీడు, పి.. కృష్ణ-521 202
8. గవర్నమెంట్‌ హెచ్‌డి క్యూఆర్‌ఎస్‌ హాస్పిటల్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, చిత్తూర్‌
9.గవర్నమెంట్‌ హెచ్‌డి క్యూఆర్‌ఎస్‌ హాస్పిటల్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, నిజామాబాద్‌
10. గ్రేస్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, రామానాయుడు పేట, పి.బి నెం. 11, మచిలీపట్నం-521 001
11.హేలాపురా స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, ఏలూరు, .గోదావరి- 534 005
12. జశ్వంత్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, న్యూ మూర్తీ నగర్‌, కొత్తపేట, హైదరాబాద్‌-500035
13. జయ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, కేరాఫ్‌ జయ నర్సింగ్‌ హోమ్‌, హన్మకొండ, వరంగల్‌
14. నర్సాపూర్‌ క్రిష్టియన్‌ హాస్పిటల్‌, స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, నర్సాపూర్‌, .గోదావరి- 534275
15. నిర్మలా స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, రుద్రంపేట దగ్గర, అనంతపురం-515001
16. ప్రిన్సెస్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, పురాని హవేలి-5
17. రామకృష్ణ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ జగన్నాథపురం, కాకినాడ, తూ.గోదావరి
18. ఎస్‌.వి.ఆర్‌. హాస్పిటల్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, తిరుపతి
19. సప్తగిరి స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, వెస్ట్‌ చర్చ్‌ కాంపౌండ్‌, తిరుపతి- 517502
20. సింస్ కాలేజ్ & ఇన్స్టిటూట్ ఆఫ్ నర్సింగ్, మంగళ్ దాస్ నగర్, గుంటూరు. 5220011

బంగారు భవిష్యత్
ఆయా కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలకు కొదువ ఉండదు. విదేశాలలో నర్సుగా ఉపాధిని చేపడితే నెలకు 5వేల డాలర్ల వరకూ సంపాదించవచ్చు. కనక రంగాన్ని తమ వృత్తిగా చేయదలుచుకున్న వారికి గౌరవానికి గౌరవంతోపాటు ఆత్మసంతృప్తి లభిస్తుంది. అలాగే ఆదాయానికి కూడా ఎలాంటి లోటూ ఉండదు.

No comments:

Post a Comment