Pages

Sunday

వికీలీక్స్‌ను వేటాడడం ఆపండి

ఒబామాకు అసాంజే హితవు
లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీ బాల్కనీ నుంచి ప్రసంగం
మద్దతుదారులకు కృతజ్ఞతలు

 
‘వీకీలీక్స్‌ను వెంటాడడం, వేధించడం ఆపండి.. అధ్యక్షుడు ఒబామా మంచి పని చేయాలని కోరుతున్నా’ అని వికీలీక్స్ వెబ్‌సైట్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే.. అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామాకు హి తవు పలికారు. రెండు నెలలుగా లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్న అసాంజే తొలిసారి ఆది వారం బహిరంగంగా మాట్లాడారు. లేత నీలి చొక్కా, ఎరుపు టై ధరించిన అసాంజే ఎంబసీ గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ బాల్కనీ నుంచి ప్రపంచ మీడియా, మద్దతుదారులనుద్దేశించి ప్రసంగించారు. ఓపక్క.. తాను బయటకొ స్తే అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉన్న వందమంది పోలీ సు అధికారులు, అక్కడి ప్రతి కదలికపై నిఘా కోసం గగనతలంతో హెలికాప్టర్.. మరోపక్క 200 మంది మద్దతుదారు కోలాహలం మధ్య ఆయన మాట్లాడారు. కష్టకాలంలో ఉన్న తనకు మద్దతిస్తున్న వారికి, తనను చూడ్డానికి ఎంబసీ వద్దకు వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. 

అణచివేతను ఐక్యంగా ఎదుర్కోవాలి

వివిధ దేశాల్లో భావప్రకటన స్వేచ్ఛపై అణచివేత గురించి అసాంజే ప్రస్తావించారు. ‘అణచివేతలో ఐక్యత ఉంది. కనుక దాన్ని ఎదుర్కోవడంలోనూ పూర్తి ఐక్యత, సంకల్పం ఉండాలి. అమెరికా వికీలీక్స్‌ను వెంటాడి వేధించడం మానుకోవాలి. విజిల్ బ్లోయర్స్‌పై అమెరికా యుద్ధం ఆగి తీరాలి. ఎఫ్‌బీఐ దర్యాప్తును రద్దు చేయాలి. అది వికీలీక్స్ అయినా, న్యూయార్క్ టైమ్స్ అయినా మీడియా సంస్థను వేధించడమదానిపై మూర్ఖపు చర్చ ఇక సాగకూదు. వికీలీక్స్ సిబ్బందిని, మద్దతుదారులను వేధించకూడదు’ అని అన్నారు. వికీలీక్స్‌కు రహస్య సమాచారాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రాడ్లీ మానింగ్‌ను విడుదల చేయాలని అమెరికాను డిమాండ్ చేశారు. ‘బ్రాడ్లీ నిజంగా లీక్ చేసి ఉంటే అతడు హీరో. ప్రపంచంలోనే గొప్ప రాజకీయ ఖైదీ. మాకు ఆదర్శం’ అని వ్యాఖ్యానించారు. 

ఈక్వెడార్ కు కృతజ్ఞతలు

తనకు ఎంతో ధైర్యంగా రాజకీయ ఆశ్ర యమిచ్చిన ఈక్వెడార్ అధ్యక్షుడు రాఫెల్ కొరెయాకు, ఆ దేశ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నానని అసాంజే చెప్పారు. న్యాయం కోసం పోరాడుతున్న అమెరికా, బ్రిటన్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కృతజ్ఞతని పేర్కొన్నారు. ప్రపంచం చూస్తోందే కనుకే తనను అరెస్టు చేయాలనుకుంటున్న బ్రిటన్ ఇంతవరకు ఎంబసీల భద్రతపై వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించలేదన్నారు. 

‘ఈక్వెడార్ ఎంబసీ జోలికొస్తే ఖబడ్దార్’

అసాంజేకు ఆశ్రయమిచ్చిన ఈక్వెడార్‌కు లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాలు వెన్నుదన్నుగా నిలిచాయి. లండన్‌లోని ఆ దేశ ఎంబసీకి ఉన్న దౌత్య రక్షణను ఉల్లంఘిస్తే బ్రిటన్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాయి. ఈక్వెడార్ విజ్ఞప్తిపై బొలీవియన్ అలయన్స్ ఫర్ ద పీపుల్ ఆఫ్ అమెరికా(ఆల్బా) పైవిధంగా స్పందించింది. బ్రిటన్ బలప్రయోగ యత్నాలను ఖండించాలని ఆ కూటమి ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. వెనెజులా నేతృత్వంలోని ఆల్బా కూటమిలో బొలీవియా, క్యూబా, నికరాగువాలతోపాటు పలు కరీబియన్ దేశాలున్నాయి.

No comments:

Post a Comment