మూత్రవ్యాధులు ఏర్పడడానికి బ్యాక్టీరియా ముఖ్య కారణం. ఈ ఇన్‌ఫెక్షన్ మహిళలలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మూత్రాశయంలో బ్లాడర్, యురేత్రా, మూత్రపిండాలు, యురేటర్స్ మొదలైన భాగాలుంటాయి. సాధారణంగా మూత్రాశయం అంతర్భాగం ఎపితేలియమ్ అనే పొరతోటి కప్పబడి ఉంటుంది. ఇది మూత్రాశయాన్ని ఇన్‌ఫెక్షన్ నుండి కాపాడుతుంది. ఈ పొర గాయపడినపుడు ఇ. కోలై, స్టెఫైటోకోరస్ వంటి బ్యాక్టీరియా వల్ల ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. మూత్రాశయం క్రింద భాగంలో వచ్చే సమస్యను సిస్జెటిస్, యురేత్రైటిస్ అంటారు. పైభాగంలో వచ్చే సమస్యను పైలోనెఫ్రైటిస్ అంటారు.
కారణాలు
* మహిళలలో మూత్ర విసర్జన ద్వారము(యురేత్రా), మల విసర్జన ద్వారము(ఆనస్) దగ్గరగా ఉండడం వలన ఇన్‌ఫెక్షన్ సులువుగా వచ్చే అవకాశం ఉంది.
* డయాబెటిస్ లేదా అతిమూత్ర వ్యాధి.
* వయస్సు మీరిన వారిలో వచ్చే అవకాశం ఉంది.
* మూత్ర విసర్జన సరిగ్గా జరగకపోవడం(యూరినరీ రిటెన్షన్).
* గర్భిణి స్త్రీలలో.
* శస్త్ర చికిత్సల సమయంలో పెట్టే యూరినరీ కాథెటర్ వలన వచ్చే అవకాశం ఉంది.
* పురుషులలో ప్రొస్ట్రెట్ గ్రంథి వాపు వల్ల వచ్చే అవకాశం ఉంది.
* కదలికలు లేకుండా ఎక్కువ కాలం ఉండటం వల్ల ఉదాహరణకు ఎముక ఫ్రాక్చర్ వంటివి.
* కొత్తగా పెళ్లయిన దంపతులలో వచ్చే ఇన్‌ఫెక్షన్‌ని హనీమూన్ సిస్టైటిస్ అంటారు.
లక్షణాలు... మూత్ర విసర్జన సమయంలో మంట, మూత్రం ఆగిఆగి రావడం, పూర్తిగా విసర్జించలేకపోవడం, తరచు మూత్ర విసర్జన చేయాలనిపించడం, మూత్ర విసర్జన ద్వారము వద్ద దురద, జ్వరంగా ఉండటం, చలి, వాంతులు అవ్వడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉంటాయి.
వ్యాధి నిర్ధారణా పరీక్షలు... సివిఇ, సిబిపి మరియు ఇఎస్ఆర్, యూరిన్ అనాలిసస్ అండ్ కల్చర్, అల్ట్రా సౌండ్, యుఎస్‌జి కిడ్నీస్, బ్లాడర్, కెయుబి, ఆర్‌బిఎస్, ఎఫ్‌బిఎస్, పిఎల్‌బిఎస్, ఇన్‌ట్రావీనస్ పైలోగ్రామ్(ఐవిపి), సిటి స్కాన్ అబ్డామెన్, ప్రొస్ట్రెట్ స్పెసిఫిక్ యాంటిజెన్. ఇది పురుషులలో ప్రొస్ట్రేట్ గ్రంథి వాపు ఉంటే చేస్తారు(పిఎస్ఎ టెస్ట్).
తీసుకోవలసిన జాగ్రత్తలు
* నీరు ఎక్కువగా తీసుకోవాలి.
* జననేంద్రియాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
* బిగుతుగా ఉండే లోదుస్తులు వాడకూడదు.
* జననేంద్రియాల వద్ద డియోడెరెంట్లు, పెర్ఫ్యూమ్‌లు వంటి సుగంధ ద్రవ్యాలు వాడకూడదు.
హోమియో చికిత్స ఈ సమస్యకు హోమియోలో వాడదగిన మందులు అరెంటమ్ నైట్రికమ్, కాస్టికమ్, మెర్క్‌సాల్, కాన్తారిస్, నైట్రిక్ యాసిడ్, క్లిమేటిస్ కన్నాబిస్ సెటైవా, తూజా.
అర్టెంటమ్ నైట్రికమ్: ఇది నరాలు, మెదడు మీద మంచి ప్రభావం చూపుతుంది. మూత్రం తెలియకుండా రావడం, మూత్ర మార్గంలో వాపు, నొప్పి, మంట, మూత్రం ఆగిఆగి రావడం, మూత్రం కొంచెంగా ఉండి రంగు ఎక్కువతో కూడి ఉండటం వంటి లక్షణాలు ఉన్న వారికి ఇది దివ్యౌషధం.
కాస్టికమ్: దగ్గినపుడు, తుమ్మినపుడు మూత్రం పడటం, మూత్రం మెల్లగా ఆగిఆగి రావడం, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం, ముఖముపై పులిపిర్లు కలిగి ఉండటం వంటి లక్షణాలకు ఈ మందు బాగా పనిచేస్తుంది.
మెర్క్‌సాల్: మూత్రం తరచు రావడం, మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి, మూత్రం ముదురు రంగులో, కొంచెంగా, రక్తం కలిగి ఉండటం వంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు చక్కని ఉపశమనం కలిగిస్తుంది.
కాన్తారిస్: మూత్రం ఆపుకోలేకపోవడం, మూత్ర విసర్జనకు ముందు, తర్వాత తీవ్రమైన నొప్పి, మంట, మూత్రాశయం మొత్తం కత్తులతో పొడిచినట్లు నొప్పి, రక్తంతో కూడిన మూత్రం చుక్కలుగా రావడం, తరచు మూత్ర విసర్జన చేయాలనిపించడం వంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందు తీసుకుంటే మంచి ఫలితాలను ఇస్తుంది.
నైట్రిక్ యాసిడ్: మూత్రం కొంచెంగా, వాసనతో కూడి ఉండటం, మూత్ర విసర్జన సమయంలో మంట, చర్మం చీల్చినట్లు నొప్పి, మూత్రంలో రక్తం, చీము వంటివి ఉండటం, నోటి పూత, అర్శమొలలు, ఫిజర్, పుండ్ల నుండి రక్తం కారడం, పులిపిర్లు ఉండటం వంటి లక్షణాలు ఉంటే ఈ మందు ఉపశమనం కలుగచేస్తుంది.
క్లియాటిస్: ఇది గ్రంథులు, జననేంద్రియాలు, చర్మం మీద మంచి ప్రభావం చూపుతుంది. మూత్ర విసర్జన తర్వాత కొంతసేపటి వరకు నొప్పి ఉండటం, తరచూ కొద్దిగా, మంటతో కూడిన మూత్రం రావడం, మూత్రం ఆగి ఆగి రావడం, గ్రంథుల వాపు, చర్మంపై దురదులు మొదలైన లక్షణాలకు ఇది మంచి మందు.
తుజా: ఇది చర్మం, మూత్రపిండాలు, మెదడు, రక్తం మొదలైన భాగాలపై మంచి ప్రభావం చూపుతుంది. మూత్రద్వారం వాపు, నొప్పి, మూత్రం ఆగి ఆగి రావడం, మూత్ర విసర్జన తర్వాత నొప్పి, తరచూ మూత్రం రావడం, మూత్రంపై నియంత్రణ తగ్గడం మొదలైన లక్షణాలకు ఇది చక్కని మందు.
ఏదేమైనా రోగి లక్షణాలు, అతని గత ఆరోగ్య జీవితాన్ని ఆధారం చేసుకుని హోమియో వైద్య చికిత్స అందచేయడం జరుగుతుంది. వ్యక్తి వ్యక్తిని బట్టి చికిత్సా విధానం మారుతుంది. వైద్యుల పర్యవేక్షణలోనే ఈ మందులను వాడవలసి ఉంటుంది.

No comments:
Post a Comment