తన బలిమి కన్నా స్థాన బలిమి గొప్పదంటారు. నిజమే మరి... పల్లెటూరిలో వంద గజాలు, నగరంలో ఒక గజానికి కూడా సరితూగకపోవచ్చు. ఊళ్లో కట్టిన ఇంద్రభవనం యాభై లక్షలు పలికితే మహానగరంలో ఆ ధరకు ఏ గోడా మనది కాని ఓ ఫ్లాటు దొరుకుతుంది. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు మీకు చెప్పబోయే ఇల్లు ఒక ఎత్తు.
అది ఒక ఆధునిక పూరి గుడిసె. చిట్టి పొట్టి చెక్క ఇల్లు. ఇంగ్లండ్‌లోని డోర్సెట్ కౌంటీ (జిల్లా అని చదువుకోండి)లో ఉన్న క్రైస్ట్‌చర్చ్ పట్టణంలో ఉంటుంది. సముద్ర తీరం పక్కనే ఉన్న ఈ పట్టణంలో లోపలికి చొచ్చుకుపోయిన నేలపై ఉంటుందీ గుడిసె. 18 అడుగుల పొడవున్న ఆ చెక్క పెట్టె వంటి ఇంట్లో ఆరుగురు పడుకోవచ్చు. అది కూడా అటక మీద ముగ్గురు, కింద ముగ్గురు. ఈ బెడ్లు అన్నీ రైల్వే స్లీపర్ బోగీ బెర్తుల్లాగా ఉంటాయి.
ఈ బుల్లి ఇంట్లో ఓ చిన్న వంటగది కూడా ఉంటుంది. ఇలాంటివి బోలెడు చూశాంలే అనుకుని పేజీ తిప్పేస్తే ఒక ఆశ్చర్యాన్ని మిస్సవక తప్పదు. ఇంత గొప్పగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... ఆ బుల్లి చెక్క ఇంటి ఖరీదు అక్షరాలా కోటిన్నర రూపాయలు. బ్రిటన్ కరెన్సీలో చెప్పినా దాని ధర ఎక్కువే. లక్షా 70 వేల పౌండ్లు. దీనికి ఎందుకు ఇంత డిమాండంటే అదొక అద్భుతమైన రిలాక్సేషన్ వ్యూ. పర్యావరణ పరంగా చాలా ఆహ్లాదకరమైన ప్రాంతం.
రెండు వైపులా సముద్రం. ఒక వైపు దూరంగా పట్టణం. మరోవైపు పచ్చటి గడ్డినేలలు. ఇక్కడ ఇలాంటి బీచ్ హట్స్ 350 ఉన్నాయి. అయితే, అందులో ఇదే ఖరీదైనది. మిగతా అన్నింటికంటే ఈ గుడిసె నుంచి బయటకు చూస్తే చాలా మంచి వ్యూ ఉందని దీన్ని సొంతం చేసుకున్న ఆండ్రూ డెనిసన్ చెప్పారు. ఇక్కడ ఓ ట్విస్ట్ ఏంటంటే... ఆ గుడిసె మాత్రమే మీది. దాని కింది నేల కాదు. ప్రతి సంవత్సరం ఆ స్థలానికి 2 లక్షల 20 వేల అద్దె కట్టాలి.

No comments:
Post a Comment