Pages

Thursday

సిసలైన భవితకు సరైన వేదిక ఎన్‌డీఏ


ఇంటర్ అర్హతతోనే త్రివిధ దళాల్లో అధికారి కావాలనుకునేవారికి నేషనల్ డిఫెన్‌‌స అకాడెమీ(ఎన్‌డీఏ) సరైన వేదిక. చదువు, శిక్షణ, ఉద్యోగం మూడింటి మేలి కలయికే ఎన్‌డీఏ. శిక్షణతో పాటు డిగ్రీ ప్రదానం, రూ.45,000 జీతంతో కెరీర్ ఆరంభం కావడం ఎన్‌డీఏ విశిష్టతలు. పరీక్ష విధానం, ఎంపిక, శిక్షణ, కెరీర్‌గ్రాఫ్...వివరాలు చూద్దామా...

ఇంటర్ పూర్తికాగానే... చాలామంది ఎంసెట్... ఐఐటీ...ఏఐట్రిపుల్‌ఈ... గురించే ఆలోచిస్తారు. అలా కాకుండా ప్రత్యామ్నాయాన్ని కోరుకునేవారికి మేలిమి అవకాశం ఎన్‌డీఏ పరీక్ష. దీనిద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌ల్లో ఎందులోనైనా ఆఫీసర్ హోదాతో చేరొచ్చు. అంతే కాదు మూడేళ్ల శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ యూని వర్సిటీ-న్యూఢిల్లీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పట్టా కూడా పుచ్చుకోవచ్చు.

ఎన్‌డీఏ: దేశ భద్రతను కాపాడే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్‌‌సకు చురుకైన సైనికులను అందించే లక్ష్యంతో మహారాష్ట్రలోని పుణెలో భారత ప్రభుత్వం ఆరు దశాబ్దాల క్రితం నేషనల్ డిఫెన్‌‌స అకాడెమీ (ఎన్‌డీఏ)ను ఏర్పాటుచేసింది. అప్పటి నుంచి ఎంతోమంది సుశిక్షుతులైన సైనికులను త్రివిధ దళాలకు అందిస్తూ వస్తోంది. రక్షణ దళాల్లో చేరేందుకు మేటి పరీక్షగా ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏకు మంచి పేరుంది. అందుకే ఈ పరీక్షను యూపీఎస్‌సీ నిర్వహిస్తోంది. భారత దేశంలో ఇంటర్మీడియట్ అర్హతతో నిర్వహించే చదువు, శిక్షణ, ఉద్యోగం మూడింటి సమ్మిళిత ఏకైక పరీక్ష ఇదే.

ఎంపిక ఇలా: మూడంచెల్లో ఎంపిక చేస్తారు.
స్టేజ్ 1: రాత పరీక్ష. ఇందులో మ్యాథమెటిక్స్ 300 మార్కులకు, జనరల్ ఎబిలిటీ టెస్ట్ 600 మార్కులకు ఉంటాయి.
స్టేజ్ 2: ఇంటర్వ్యూ(ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్) 900 మార్కులు
స్టేజ్ 3: మెడికల్ ఎగ్జామినేషన్
రాత పరీక్ష: ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఇంగ్లిష్ మాద్యమంలో ఉంటుంది. తప్పు సమాధానానికి మార్కుల్లో కోత. రాత పరీక్షలో ఉత్తీర్ణులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అందులో విజేతలుగా నిలిచినవాళ్లు వైద్య పరీక్షలకు వెళ్తారు. ఆ పరీక్షలో ఫిట్‌నెస్ ఓకే ఐన అభ్యర్థులు కోర్సుకు ఎంపికవుతారు.

సిద్ధమవ్వండిలా....

మ్యాథమెటిక్స్: 300 మార్కులకు రెండున్నరగంటల పాటు జరిగే మ్యాథమెటిక్స్ (పేపర్- 1)లో.. మంచి మార్కులకోసం సిలబస్‌లోని అన్ని అంశాలపైనా పట్టు సాధించాలి. ఎందుకంటే పరీక్షలో అన్ని విభాగాల నుంచీ ప్రశ్నలడుగుతున్నారు. ప్రశ్నలన్నీ కాన్సెప్ట్ బేస్డ్‌గానే ఉంటున్నాయి. ఫార్ములాస్‌పై పట్టుసాధిస్తే... పరీక్షలో సమయం వృథా కాకుండా ఎక్కువ ప్రశ్నలను రాసేందుకు వీలవుతుంది.

జనరల్ ఎబిలిటీ: 600 మార్కులకు రెండున్నర గంటల వ్యవధిలో ఈ పరీక్ష ఉంటుంది. ఇందులో పార్‌‌ట- ఏ,పార్‌‌ట-బీలు ఉంటాయి.
ఇంగ్లిష్: పార్‌‌ట ఏలో ఇంగ్లిష్ 200 మార్కులకు ఉంటుంది. ఇందులో అభ్యర్థికి ఇంగ్లిష్ భాషపై కనీస పరిజ్ఞానం ఉందో లేదో పరీక్షించేందుకు వీలుగానే ప్రశ్నలు అడుగుతారు. యూసేజ్, ఒక్యాబులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్, కొహెషన్ నుంచి ప్రశ్నలు వస్తాయి. షార్‌‌టస్టోరీస్ చద వడం, పార్‌‌ట్స ఆఫ్ స్పీచ్, టెన్సెస్ నేర్చుకోవడం... కరక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, యాంటొనిమ్స్, సిననిమ్స్‌కు సంబంధించిన ప్రశ్నలకు సులువుగానే సమాధానం రాయొచ్చు.

జనరల్ నాలెడ్‌‌జ: జనరల్ ఎబిలిటీ పేపర్‌లోని పార్‌‌ట-బి మొత్తం అభ్యర్థిలోని జనరల్ నాలెడ్‌‌జని పరీక్షించేందుకు ఉద్దేశించారు. దీనికి 400 మార్కులు కేటాయించారు. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్‌‌స, చరిత్ర, జాగ్రఫీ, కరెంట్ అఫర్‌‌స నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు ఈ పరీక్షను సులభంగానే ఎదుర్కోవచ్చు. ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులు మాత్రం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంశాల కోసం కసరత్తు చేస్తేనే సఫలీకృతం కాగలరు. కరెంట్ అఫైర్స్ కోసం సరిగ్గా పరీక్ష తేదీ నుంచి ఒక సంవత్సరం వెనుక వరకు ప్రపంచం, దేశంలో జరిగిన వివిధ పరిణామాలు తెలుసుకోవాలి.

శిక్షణ ఇలా...
ఎంపికైన అభ్యర్థులకు పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో మూడేళ్ల డిగ్రీ చదువుతో పాటు శిక్షణ నిర్వహిస్తారు. ఎయిర్ ఫోర్స్, నేవీ, నావల్ అకాడెమీ కోర్సులకు ఎంపికైన వాళ్లు బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్/కెమిస్ట్రీ) కోర్సుగా ఎంచుకోవచ్చు. ఆర్మీ గ్రూప్ కోర్సుకు ఎంపికైన వాళ్లు బీఏలో హిస్టరీ/జాగ్రఫీ/ఎకనామిక్స్/పొలిటికల్ సైన్స్‌ల్లో నచ్చిన మూడు ఆప్షన్లను చదవొచ్చు. వర్క్‌షాప్, ఏరియూ స్టడీ, మిలిటరీ హిస్టరీలను సిలబస్‌తోపాటు బోధిస్తారు. రక్షణ దళాల అవసరాలకు అనుగుణంగా శారీరక తర్ఫీదునిస్తారు. అన్ని విభాగాల వారికీ శిక్షణ ఒకే పద్ధతిలో ఉంటుంది. మూడేళ్ల కోర్సు పూర్తిచేసిన తర్వాత బీఏ/బీఎస్సీ పట్టాలు పొందొచ్చు.

మూడేళ్ల తర్వాత...
ఆర్మీ క్యాడెట్లు డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడెమీ (ఐఎంఏ)లో ఏడాదిపాటు ఆఫీసర్ శిక్షణ పొందుతారు. నేవల్ క్యాడెట్లకు ఏడాదిపాటు కేరళలో సముద్రంలో శిక్షణ నిర్వహిస్తారు. ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లకు ఫ్లైయింగ్‌లో ఏడాదిన్నరపాటు ఎయిర్‌ఫోర్స్ అకాడెమీ-హైదరాబాద్‌లో శిక్షణ ఉంటుంది. సంబంధిత క్యాడెట్ శిక్షణలో నెలకు రూ. 21,000 స్టైపెండ్‌గా చెల్లిస్తారు.కెరీర్ గ్రాఫ్: క్యాడెట్ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు దళాల్లోనూ వరుసగా... లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్, ఫ్లైయింగ్ ఆఫీసర్ క్యాడర్‌తో ఆఫీసర్ స్థాయి కెరీర్ ప్రారంభమవుతుంది.

పై మూడు విభాగాల్లోనూ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, అడ్మిరల్, ఎయిర్ చీఫ్ మార్షల్ విశిష్ట ఉద్యోగాలు. ఎన్‌డీఏ ద్వారా ఎంపికైనవాళ్లు అవకాశాన్ని బట్టి రక్షణ దళాల్లో సంబంధిత విభాగానికి భవిష్యత్తులో చీఫ్‌గా ఎంపిక కావచ్చు. ప్రారంభ కెరీర్‌కు, అత్యంత విశిష్ట ఉద్యోగానికి మధ్యలో 8 స్థాయిలుంటాయి. ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్ ఏ విభాగంలో కెరీర్ ఎంచుకున్నా వేతనాల్లో వ్యత్యాసాలుండవు. పూర్తికాలం సర్వీస్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా సంబంధిత విభాగంలో మేజర్ జనరల్/రేర్ అడ్మిరల్/ ఎరుుర్ వైస్ మార్షల్ స్థారుుకి చేరుకుంటారు.

ఇవీ బెనిఫిట్స్: ఉచిత వసతి, సబ్సిడీ ధరలకు ఆహార సామగ్రి, పిల్లలకు ఉచిత విద్య, ఉచితంగా వైద్యం, సబ్సిడీ ధరలకు రైలు ప్రయాణం, ట్యాక్స్ ఫ్రీ క్యాంటీన్...లాంటి సౌకర్యాలెన్నో ఉన్నాయి. పదిహేనేళ్లు సర్వీస్ ఉంటే ఫుల్ పెన్షన్ పొందే అవకాశం కూడా ఉంది.

అర్హతలివీ....
ఆర్మీ వింగ్: ఏదైనా ఇంటర్ గ్రూప్‌తో పాస్
ఎయిర్ ఫోర్స్, నేవీ, నావల్ అకాడెమీ:
మ్యాథ్స్, ఫిజిక్స్‌లతో ఇంటర్ ఉత్తీర్ణత
వ యోపరిమితి: 16బీ-19 ఏళ్లు
అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. నిర్దేశిత శారీరక ప్రమాణాలుండాలి.
ప్రకటన: ప్రతిఏటా మార్చ్, అక్టోబర్‌ల్లో
పరీక్ష: ఏప్రిల్, ఆగస్ట్‌ల్లో
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి
వెబ్‌సైట్: www.upsc.gov.in

No comments:

Post a Comment