సిగరెట్ మానడానికి తిప్పలు పడుతున్నారా? దాన్ని ముట్టుకోకుండా మనసును నియంత్రించలేక పోతున్నారా? ఇకపై ఆ చింత అవసరం లేదు! ఒకే ఒక్క ఇంజెక్షన్‌తో సిగరెట్ పీడ వదిలించుకోవచ్చని లండన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సిగరెట్‌లోని మత్తుపదార్థం నికోటిన్ కోరల్లోంచి పొగరాయుళ్లు బయటపడటానికి వెయిల్ కార్నెల్ మెడికల్ సెంటర్ పరిశోధకులు ఓ డీఎన్ఏ ఇంజెక్షన్‌ను రూపొందించారు. దీని ద్వారా నికోటిన్‌ను ఎదుర్కొనడానికి దేహంలో యాంటీబాడీలను తయారుచేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
'ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి పంపే జన్యువులు.. నికోటిన్‌ను తటస్థ పరిచి మెదడుపై దాని ప్రభావం లేకుండా చేయవచ్చు. ఒకసారి ఇంజెక్షన్ తీసుకుంటే చాలు. నికోటిన్‌తో పోరాడే యాంటీబాడీలను కాలేయం ఎప్పటికీ ఉత్పత్తి చేయగలదు. దీనివల్ల ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. దీంతో సిగరెట్ తాగిన వారికి ఎలాంటి ఆహ్లాదం కలగదు. క్రమంగా ఆ అలవాటు నుంచి బయటపడతార'ని వివరించారు.
దీన్ని చిన్నారులకు కూడా వేక్సిన్ రూపంలో ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో వారు సిగరెట్ జోలికి వెళ్లకుండా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ మందును ఎలుకలపై ప్రయోగిస్తున్నారు. మరో రెండేళ్లలో మనుషులపై ఈ ప్రయోగాలు చేపట్టే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. అన్నింటిని దాటుకుని ఇది మార్కెట్లోకి రావడానికి మరో ఐదేళ్లు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.

No comments:
Post a Comment