దాయాది దేశం తన నాలుగో అణు రియాక్టర్‌ను రాజధాని ఇస్లామాబాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలో కుషబ్ అనే ప్రాంతంలో నిర్మిస్తోంది. అదిప్పటికే సగం పూర్తయింది కూడా. వచ్చే పదిహేను నెలల కాలంలో దాదాపుగా పూర్తి కావచ్చు. ఇటీవలే అమెరికాకు చెందిన ఓ ఉపగ్రహం తీసిన చిత్రాల ద్వారా ఈ విషయం తెలిసింది. ఇది గనుక పూర్తయితే అణు క్షిపణులకు అవసరమైన ప్లుటోనియం ఉత్పత్తిని వేగవంతం చేయడానికి పాకిస్థాన్‌కు వెసులుబాటు లభిస్తుంది. అలా గే భారీ సంఖ్యలో చిన్న చిన్న అణు వార్‌హెడ్లను తయా రు చేయడానికి కూడా వీలు కలుగుతుందని అమెరికాకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ వెల్లడించింది.![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgxReBsvs6DU7yo4D66W8_Njct11T686KsjRsVPYeKVU-Q6LsVLeDLqIfpO5Cdaw_gHcMBDmYqliONMIjb12RJ_h0g-q_4hcfOrVsEmP8mv3JrEnm1utwq-XzTTW_8Hv8s4sGuXRL-vcqA/s280/Pakistan+is+Building+4th+Nuclear+Reactor+at+Khushab+for+the+production+of+the+plutonium.jpg)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgxReBsvs6DU7yo4D66W8_Njct11T686KsjRsVPYeKVU-Q6LsVLeDLqIfpO5Cdaw_gHcMBDmYqliONMIjb12RJ_h0g-q_4hcfOrVsEmP8mv3JrEnm1utwq-XzTTW_8Hv8s4sGuXRL-vcqA/s280/Pakistan+is+Building+4th+Nuclear+Reactor+at+Khushab+for+the+production+of+the+plutonium.jpg)
No comments:
Post a Comment